Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ పోలీస్ అయిపోయాడు

By:  Tupaki Desk   |   16 Feb 2016 3:48 AM GMT
సందీప్ కిషన్ పోలీస్ అయిపోయాడు
X
పిజ్జా - సూదుకవ్వం వంటి సినిమాలతో మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా గుర్తింపు పొందిన సీవీ కుమార్.. ప్రస్తుతం దర్శకుడిగా అవతారం ఎత్తి ఓ ద్విభాషా చిత్రం స్టార్ట్ చేశాడు. తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో రూపొందనున్న ఈ మూవీ కోసం.. హీరోయిన్ సెర్చ్ ఇప్పటికి పూర్తయినట్లు తెలుస్తోంది.

మొదట తాప్సీని హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నా.. ఆమె డేట్స్ ఎడ్జస్ట్ కాకపోవడంతో ఇప్పుడు అందాలరాక్షసి లావణ్య త్రిపాఠికి ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. సైంటిఫిక్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో.. హీరో ఒక పోలీస్ ఆఫీసర్ కాగా.. హీరోయిన్ కు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ రోల్ ఓ సైక్రియాట్రిస్ట్ కావడంతో.. పెర్మాఫెన్స్ చేయగల ఆర్టిస్ట్ కోసం చాలా వెతకాల్సి వచ్చింది. సీవీ కుమార్ చెప్పిన కథ విషయంలో అందరికీ పాజిటివ్ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ స్క్రీన్ పై ఫిక్షన్ ను కొత్త స్టైల్ లో సీవీ కుమార్ చూపించనున్నాడని అంటున్నారు.

స్టూడియో గ్రీన్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి ఇంకా టైటిల్ సెట్ చేయలేదు కానీ.. తమిళ్ మాత్రం మాయావన్ అనే పేరుతో తెరకెక్కించనున్నారు. గత అక్టోబర్ లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. క్యాస్టింగ్ విషయంలో లేట్ కావడంతోనే ఇంత ఆలస్యం అయింది. ఇందులో సందీప్ కిషన్ పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఈ కుర్ర హీరో కెరీర్ లో ఇది స్పెషల్ గా నిలిచిపోనుందనే అంచనాలున్నాయి.