Begin typing your search above and press return to search.
సందీప్ కిషన్ అలా అన్నాడేంటి?
By: Tupaki Desk | 13 March 2016 1:30 PM GMTడైరెక్టర్లు చెప్పినట్లు సినిమాలు చేసుకెళ్లిపోయే హీరోలు కొంతమందే ఉంటారు. నిన్న మొన్న వచ్చిన హీరోలు సైతం స్క్రిప్టు విషయాల్లో మరీ ఎక్కువ జోక్యం చేసేసుకుంటుంటారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తుంటాయి. యంగ్ హీరో సందీప్ కిషన్ కు కూడా ఈ విషయంలో కొంచెం చెడ్డ పేరు ఉంది. మనోడు హీరో కావడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు కాబట్టి కొంచెం ఇలా జోక్యం చేసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే దీని గురించి ఓపెన్ గా మాట్లాడటం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. సూటిగా చెప్పకపోయినా.. తాను స్క్రిప్టు - డైరెక్షన్ లాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటానని చెప్పేశాడు సందీప్.
నిన్న ‘రన్’ ఆడియో ఫంక్షన్లో సందీప్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు మాత్రం దర్శకుడు చెప్పిందే చేసుకుపోయా. ఇక నుంచి అలాగే చేయాలనుకుంటున్నాను. గత ఏడాది కాలంగా నేను చాలా నేర్చుకున్నాను. చాలా మారాను’’ అన్నాడు సందీప్. ఈ మాటల్ని బట్టి చూస్తే.. ఇంతకుముందు తాను సినిమాకు సంబంధించిన వేరే వ్యవహారాల్లో ఎక్కువ జోక్యం చేసుకునేవాడినని.. ఈ సినిమాకు మాత్రం డైరెక్టర్ చెప్పింది చేశానని.. ఇకపైనా అదే చేస్తానని చెప్పకనే చెప్పేశాడని అర్థమవుతోంది. ఉన్నట్లుండి సందీప్ కు ఇలా జ్నానోదయం ఎందుకయ్యిందన్నదే అర్థం కావడం లేదు. అతడేమీ వరుస ఫ్లాపుల్లో లేడు. ‘టైగర్’ సినిమా బాగానే ఆడింది. అయినా అతడిలో ఇంత మార్పు ఎలా వచ్చేసిందబ్బా? దీనికేమైనా ప్రత్యేక కారణం ఉందా?