Begin typing your search above and press return to search.
టైగర్.. వెనక్కి తగ్గిపోయిందంతే!!
By: Tupaki Desk | 19 March 2015 4:33 AM GMTచోటా మామ అండతో హీరో సందీప్‌కిషన్ ఒక్కో మెట్టు పైకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫ్లాపులొచ్చినా, ఒడిదుడుకులు ఉన్నా నిలదొక్కుకునే సత్తా ఇన్నాళ్టికి వచ్చిందన్న ధీమాతో ఉన్నాడు. అయితే ప్రతి సినిమాకి తనని తాను సానబట్టుకుని రంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కెరీర్‌ని సీరియస్‌గానే ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలి కాలంలో వరుసగా సినిమాలొస్తున్నాయి, వెళ్తున్నాయి.
నిజానికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం దక్కలేదు. బీరువా కొన్నిచోట్ల వసూళ్లలో ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు టైగర్‌ని నేనే అంటూ వస్తున్నాడు. తన ఇమేజ్‌కి టైగర్ టైటిల్ సరిపోలేదని విమర్శలొచ్చినా వాటికి సర్ధిచెప్పే పనిలో పడ్డాడు. ఎట్టకేలకు టైగర్ మండే ఎండల్లో రిలీజవుతుందని హింటిచ్చాడు. సందీప్ ఆన్‌లైన్‌లో చెబుతూ మేలో రిలీజ్‌కి వచ్చేస్తోందని చెప్పాడు. మొన్నటివరకు ఏప్రిల్ 10నే రిలీజ్ అని ప్రచారమైనా కూడా.. ఇక పెద్ద సినిమాల జోరు మధ్యలో మనోడి గేమ్స్ కష్టమని అర్ధమైపోయినట్లుంది. అందుకే వెనక్కి తగ్గిపోయాడు. లేకపోతే అసలుకే మోసం వచ్చే ఛాన్సుంది.
టైగర్ సరసన రన్ రాజా రన్ ఫేం సీరత్‌కపూర్ కథానాయికగా నటిస్తోంది. రాముల్ రవీంద్రన్ కీలకపాత్రధారి. తమన్ సంగీతం అందిస్తున్నాడు. టైగర్ టైటిల్ పెట్టుకున్నందుకు మంచి అంచనాలే ఏర్పడ్డాయి. వాటిని రీచ్ అయ్యేలా కంటెంట్ ఉంటే సందీప్‌కి హిట్టు దక్కుతుంది. కంటెంట్ మైనస్ అయితే యథా ఫలితమే రిపీటవుతుంది. ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే.