Begin typing your search above and press return to search.
సినిమా రివ్యూ : టైగర్
By: Tupaki Desk | 26 Jun 2015 10:17 AM GMTరివ్యూ: టైగర్
రేటింగ్: 3 /5
తారాగణం: సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్, సౌందీప్, సప్తగిరి, తనికెళ్ల భరణి, ప్రవీణ్, తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు
మాటలు: అబ్బూరి రవి
నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు
కథ, స్క్రీన్, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్
హీరోగా మొదట్నుంచి సాఫ్ట్ క్యారెక్టర్లే వేశాడు సందీప్ కిషన్. ఐతే ఒక్కసారిగా 'టైగర్' లాంటి టైటిల్‌తో మాస్ సినిమా అనేసరికి జనాలకు మింగుడుపడలేదు. కానీ ట్రైలర్‌తో మంచి ఇంప్రెషనే వేశాడు సందీప్. తమిళ దర్శకుడు వీఐ ఆనంద్ రూపొందించిన ఈ సినిమా చాన్నాళ్ల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి 'టైగర్' అనే టైటిల్‌కు సందీప్ కిషన్ న్యాయం చేశాడా? మాస్‌ను మెప్పించాలన్న అతడి లక్ష్యం ఫలించిందా? చూద్దాం పదండి.
కథ:
టైగర్ (సందీప్ కిషన్) ఓ అనాథ. చిన్నప్పట్నుంచి అనాథాశ్రమంలో పెరిగిన అతడికి విష్ణు (రాహుల్ రవీంద్రన్) అంటే ప్రాణం. విష్ణు దత్తతకు వెళ్లిపోయినా అతడి మీద టైగర్‌కున్న ఇష్టం తగ్గదు. పెద్దయ్యాక కూడా అతణ్ని వదిలిపెట్టడు. ఐతే విష్ణు.. గంగ (సీరత్‌కపూర్) అనే కాశీ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ టైగర్‌కు అది నచ్చదు. ఆమె నుంచి విష్ణును వేరు చేయాలని చూస్తే.. తనే విష్ణుకు దూరమవ్వాల్సి వస్తుంది. ఐతే గంగను ప్రేమించినందుకు విష్ణు ప్రాణానికి ముప్పు వస్తుంది. ఆ సంగతి తెలిసిన టైగర్ ఏం చేశాడు? విష్ణుకు వచ్చిన సమస్యేంటి? ఆ సమస్యను టైగర్ ఎలా పరిష్కరించాడు? అన్నది మిగతా కథ.
కథనం, విశ్లేషణ:
మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తమిళంలో భిన్నమైన కథలతో ప్రయోగాత్మక చిత్రాలు వస్తుంటాయన్నది వాస్తవం. మన దర్శకులు, రచయితలు రొటీన్ కథాకథనాలతోనే ప్రేక్షకుడికి మినిమం గ్యారెంటీ వినోదాన్నిచ్చి సేఫ్ గేమ్ ఆడాలని చూస్తుంటారు. 'టైగర్'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ దర్శకుడు వీఐ ఆనంద్ కూడా మన డైరెక్టర్ల లాగే ఆలోచించాడు. తమిళంలో 'అప్పూచి గ్రహం' అనే విభిన్నమైన సినిమా తీసిన ఆనంద్.. తెలుగులో మాత్రం 'టైగర్'ను రొటీన్ కథాకథనాలతోనే నడిపించాడు. అది కొంత నిరాశపరిచినా.. 'టైగర్'లో వినోదానికి మాత్రం ఢోకా లేదు. రెండు గంటల తక్కువ నిడివితో బోర్ కొట్టకుండా చకచకా సాగిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్.
లీడ్ రోల్ చేసిన హీరోకు హీరోయిన్ లేకపోవడం.. అతడికి ఒక్క డ్యూయెట్ కూడా పెట్టకపోవడం.. సినిమా మొదలైన అరగంటకు కానీ హీరో ఎంట్రీ ఇవ్వకపోవడం.. ఇవన్నీ మన కమర్షియల్ సినిమాల లెక్కల్లో ఇమడని విషయాలు. ఈ విషయంలో 'టైగర్' కొత్తగా అనిపిస్తుంది. ఐతే మిగతా వ్యవహారమంతా రొటీనే. ఇద్దరు అనాథలు ఆశ్రమంలో పెరగడం.. అందులో ఒకడు తేడాగా ఉండటం.. ఇంకొకడు దత్తతకు వెళ్లిపోవడం.. ఆ వెళ్లినవాడు పెద్దయ్యాక ఇతణ్ని అసహ్యించుకోవడం.. అతడి లవ్ ప్రాబ్లెమ్‌లో పడితే ఇతడే రక్షించడం.. ఇదంతా చూస్తే 'ఆర్య' సినమా గుర్తుకు రావడం సహజం. క్యారెక్టరైజేషన్లు, కాన్సెప్ట్ 'ఆర్య' నుంచి తీసుకున్నదే అయినా.. పరువు హత్యల నేపథ్యాన్ని జోడించి.. 'టైగర్'కు వెరైటీ టచ్ ఇచ్చాడు డైరెక్టర్.
కథ రొటీనే అయినా.. స్క్రీన్‌ప్లే విషయంలో ఆనంద్ తన ప్రత్యేకత చూపించాడు. రెండో హీరో యాంగిల్ నుంచి సినిమాను మొదలుపెట్టి హీరోను లేటుగా సీన్‌లోకి తీసుకురావడం తెలివైన ఎత్తుగడ. అరగంటలో రెండో హీరో లవ్ స్టోరీ తాలూకు ఫ్లాష్‌బ్యాక్‌ను చకచకా ముగించాడు. ఆ తర్వాత హీరో ఎంట్రీతో కథనం ఊపందుకుంటుంది. సందీప్ రావడమే పంచ్‌ల మీద పంచ్‌లు వేసి.. అప్పటిదాకా కొంచెం డల్‌గా సాగుతున్న కథనానికి కొంచెం ఊపు తీసుకొచ్చాడు. రెండో ఫ్లాష్‌బ్యాక్ క్రిస్ప్‌గా ఉండటంతో ప్రథమార్ధం త్వరగా ముగిసిపోతుంది. ఇక ద్వితీయార్ధమంతా హీరోయిజం మీద నడుస్తుంది. మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకున్న దర్శకుడు.. వాళ్లకు నచ్చే హీరోయిజంతో, వినోదంతో సెకండాఫ్‌ను నడిపించాడు. హాస్పిటల్లో విలన్స్‌తో హీరో ఆడే గేమ్ మాస్ ఆడియన్స్‌ను బాగా మెప్పిస్తుంది. ప్రిక్లైమాక్స్‌లో, క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతాయి. ద్వితీయార్ధంలో సందీప్ సినిమాను తన భుజాల మీద నడిపించాడు. రొటీన్‌గా అనిపించే సన్నివేశాలతోనే దర్శకుడు హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయగలిగాడు.
నిడివి రెండు గంటల్లోపే ఉండటం 'టైగర్'కు పెద్ద ప్లస్ పాయింట్. దీని వల్ల ఎక్కడా సాగదీయాల్సిన అవసరం రాలేదు. సినిమా డ్రాగ్ అయిన ఫీలింగ్ కూడా ఎక్కడా రాదు. సన్నివేశాలు క్రిస్ప్‌గా ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. ఇంటర్వెల్‌కు ముందు హీరోకు అంత బిల్డప్ ఇస్తూ సాంగ్ పెట్టడం కొంచెం అతిగా అనిపిస్తుంది. ఐతే ద్వితీయార్ధంలో ఆ బిల్డప్‌కు తగ్గట్లు సన్నివేశాలు నడుస్తాయి. క్లైమాక్స్ కొంచెం తేల్చేసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ.. ఓవరాల్‌గా మంచి ఇంప్రెషన్‌తోనే బయటికొస్తాడు ప్రేక్షకుడు. కొత్తదనం లేదని ఎ-క్లాస్ ఆడియన్స్ పెదవి విరిచినా.. టార్గెటెడ్ మాస్ ఆడియన్స్‌ను మాత్రం 'టైగర్' నిరాశ పరచదు.
నటీనటులు:
సందీప్ కిషన్ మాస్ క్యారెక్టర్లో బాగానే ఒదిగిపోయాడు. తన ఆహార్యాన్ని, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుని 'టైగర్' పాత్రకు తగ్గట్లు నటించాడు. ఇలాంటి సినిమాలు చేసిన అలవాటు లేకపోయినా.. 'టైగర్'గా అతను ఎబ్బెట్టుగా అనిపించలేదు. కాబట్టి మాస్ క్యారెక్టర్లో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఐతే డైలాగ్ డెలివరీ విషయంలో అతను ఓ మూసలో వెళ్లిపోతున్నట్లుంది. లెంగ్తీ డైలాగులు చెప్పేటపుడు ఫుల్‌స్టాప్‌లు, కామాలే ఉండట్లేదు. ఇంటెన్సిటీ చూపించాలని అతను ట్రై చేస్తుండొచ్చు కానీ.. ఎక్కడ ఆపాలో, ఎక్కడ వేగం చూపించాలో కొంచెం సరిచూసుకుంటే బెటర్. రాహుల్ రవీంద్రన్ కూడా బాగానే చేశాడు. ఐతే తొలి 40 నిమిషాల తర్వాత దర్శకుడు అతణ్ని స్ట్రెచర్‌కే పరిమితం చేసేసి సందీప్‌నే హైలైట్ చేశాడు. హీరోయిన్ సీరత్ కపూర్ అంతగా ఆకట్టుకోదు. ఆమెదో టిపికల్ ఫేస్. ఇలాంటి సినిమాలకు సూటవ్వదనే చెప్పాలి. విలన్ రోల్స్ చేసిన నటులు అంతగా ఆకట్టుకోలేదు. సప్తగిరి ఇలా మెరిసి అలా మాయమైపోయాడు. అతడితో పోలిస్తే సెకండాఫ్‌లో తాగుబోతు రమేష్ నవ్వించడంలో పర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతిక వర్గం:
సినిమాలో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్నవే మూడు పాటలు. అందులో టైటిల్ సాంగ్ మాత్రమే ఆకట్టుకుంటుంది. ఐతే అది రాంగ్ టైమింగ్‌లో వచ్చి వేస్ట్ అయిపోయింది. ఐతే బ్యాగ్రౌండ్ స్కోర్‌లో మాత్రం తమన్ ఆకట్టుకున్నాడు. టైటిల్ సాంగ్ థీమ్ మ్యూజిక్‌ను బాగా వాడుకున్నాడు. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. మేనల్లుడి సినిమా మీద ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఆయన గత సినిమాలతో పోలిస్తే.. ఇందులో సినిమాటోగ్రఫీ ఓ డిఫరెంట్ స్కీమ్‌లో సాగింది. అబ్బూరి రవి మాటలు సన్నివేశాలకు తగ్గట్లు సింపుల్‌గా ఉన్నాయి. పంచ్‌ల కోసం, భారీ డైలాగుల కోసం ఆయన ట్రై చేయలేదు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ అవసరానికి తగ్గట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు కథ విషయంలో కొత్తగా ఏమీ ట్రై చేయకపోయినా.. రొటీన్ కథనే కొంచెం భిన్నమైన స్క్రీన్‌ప్లేతో చెప్పే ప్రయత్నం చేశాడు. మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన సీన్స్‌ను అతను బాగా డీల్ చేసి తనలో మంచి కమర్షియల్ డైరెక్టర్ ఉన్నాడని చాటాడు. ఉన్న లిమిటేషన్స్‌లోనే 'టైగర్'ను జనరంజకంగా తీర్చిదిద్దాడు.
చివరిగా...
'టైగర్' నేలవిడిచి సాము చేయలేదు. ఉన్న లిమిటేషన్స్‌లోనే ఓ మోస్తరు వినోదాన్నందించాడు. మరీ కొత్తగా ఉంటుందని ఆశించకుండా, ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే 'టైగర్' నిరాశపరచడు.