Begin typing your search above and press return to search.

ఆదితో సందీప్ కిష‌న్ ద‌ర్శ‌కుడిగానా? నిర్మాత‌గానా?

By:  Tupaki Desk   |   29 Dec 2022 12:30 PM GMT
ఆదితో సందీప్ కిష‌న్ ద‌ర్శ‌కుడిగానా? నిర్మాత‌గానా?
X
యంగ్ హీరో ఆది.. సాయికుమార్ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చి నెమ్మ‌దిగా బండి లాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అప్పుడెప్పుడో కెరీర్ ఆరంభంలో రెండు..మూడు స‌క్సెస్ లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత విజ‌యం ఎలా ఉంటుందో తెలియ‌ని హీరో అయిపోయాడు. అవ‌కాశాలైతే వ‌స్తున్నాయి గానీ....స‌క్సెస్ భూత‌ద్దం పెట్టి చూసినా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ట్యాలెంటెడ్ న‌టుడే అయినా? ఆదికి టైమ్ క‌లిసి రావ‌డం లేద‌న్న‌ది అభిమానుల మాట‌.

త్వ‌ర‌లో 'టాప్ గేర్' అంటూ దూసుకొస్తున్నాడు. ఈసినిమాపై చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. స‌క్సెస్ అందుకుని బిజీ హీరోగా మారుతాను? అన్న ధీమాని వ్య‌క్తం చేస్తున్నాడు. మ‌రి 'టాప్ గేర్' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. అయితే ఈసినిమా ప్ర‌మోష‌న్ కి వ‌చ్చిన మ‌రో యంగ్ హీరో సందీప్ కిష‌న్ మాత్రం ఆది తో తాను స్వ‌యంగా ఓ సినిమా చేస్తాన‌ని ప్రామిస్ చేసాడు.

ఆది త‌న‌కు బాగా కావాల్సిన వాడు అని..మంచి న‌టుడు అని..అత‌నితో ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నట్లు తెలిపాడు. అయితే ఆదితో సందీప్ సినిమా ద‌ర్శ‌కుడిగానా? లేక నిర్మాత‌గానా? అన్న‌ది క్లారిటీ ఇవ్వ‌లేదు.

అయితే సందీప్ నిర్మాత‌గా కొన్ని సినిమాల‌కు ప‌నిచేసాడు. అవేమి పెద్ద స‌క్సెస్ అవ్వ‌లేదుగానీ నిర్మాత‌గానూ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు.

అలాగే ద‌ర్శ‌కుడిగానూ మారుతాన‌ని ప‌లు సంద‌ర్భాల్లో అన్నాడు. మ‌రి తాజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆది కోసం అత‌ను ద‌ర్శ‌కుడైనా ఆశ్చ‌ర్య‌పోన‌స‌రం లేదు. ఇక న‌టుడిగా సందీప్ కిష‌న్ కి స‌క్స‌స్ చాలా కాలంగా అంద‌ని ద్రాక్ష‌గా మారిన సంగ‌తి తెలిసిందే. తెలుగు..త‌మిళ్ భాష‌ల్లో అలుపెర‌గ‌ని పోరాటం చేసున్నా విజ‌యం మాత్రం రావ‌డం లేదు.

మ‌రి ఈ కాంబోలో సినిమా ఎప్పుడు ఆశించవ‌చ్చు అన్న‌ది వేచి చూడాలి. ఇక న‌టుడిగా సందీప్ కిష‌న్ చేతిఓ కొన్ని సినిమాలున్నాయి. త్వ‌ర‌లోనే 'మైఖెల్' అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్దమ‌వుతున్నాడు. ఇంకా కొన్ని సినిమాలు లైన‌ప్ లో ఉన్నాయి. విజ‌యాలు లేక‌పోయినా అవకాశాలు ఎలా అందుకోవాలో ఈ యంగ్ హీరోకి బాగా తెలుసు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.