Begin typing your search above and press return to search.
ఒక్కో సీన్ కు 93 వర్షన్ లు రాసేవాడట!!
By: Tupaki Desk | 3 Jan 2021 3:30 AM GMTసినిమాలోని సన్నివేశాలకు దర్శకులు అనేక వర్షన్ లు రాసుకుంటారు. అందులో కొన్నింటిని చిత్రీకరించి ఏది బాగా వచ్చింది అనుకుంటే అది ఫైనల్ గా ఉంచేస్తారు. కొందరు కథను చాలా వర్షన్ లలో రాసుకుని స్క్రీన్ ప్లేను కూడా విభిన్నంగా పలు విధాలుగా రాసుకుని ఆ తర్వాత ఫైనల్ వర్షన్ ను తీసుకుంటారు. అయితే ఒక్కో సీన్ కు అయిదు లేదా పది వర్షన్ లు రాసుకోవడం అంటే మామూలే. కాని ఈ దర్శకుడు ఏకంగా 93 వర్షన్ లు రాశాడట. తాను అనుకున్న కథను ఏకంగా 93 వర్షన్ లలో రాసుకుని చివరకు 93 వ వర్షన్ కు ఓకే చెప్పించుకున్నాడట. అదే కలర్ ఫొటో సినిమా అయ్యింది.
ఒకటి రెండు మార్పులు చెబితేనే దర్శకులు విసుగు చెందుతారు. అలాంటిది 93 సార్లు మార్పులు చేర్పులు చెప్పినా కూడా ఓపికగా మార్పులు చేయడం వల్లే కలర్ ఫొటో మంచి మార్కులు దక్కించుకుంది. 2020లో విజయం సాధించిన కొన్ని సినిమాల్లో కలర్ ఫొటో ఒకటి అనడంలో సందేహం లేదు. సుహాస్ హీరోగా ఛాందిని చౌదరి హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మించాడు. ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి.
థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే భారీ వసూళ్లు వచ్చి ఉండేవి అనేది కామెంట్స్. దర్శకుడు అంత కష్టపడ్డాడు కనుక ఈ స్థాయి విజయం దక్కిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కొత్త దర్శకులు ఇంత ఓపికగా ఉంటేనే ఇలాంటి సక్సెస్ లు అందుకోవచ్చు అనే విషయాన్ని సందీప్ రాజ్ ను చూసి నేర్చుకోవాలి. దర్శకులకు ఓపిక చాలా అవసరం అని సందీప్ రాజ్ సక్సెస్ తో యువ దర్శకులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.