Begin typing your search above and press return to search.
త్వరలోనే సెట్స్ పైకి సందీప్ రెడ్డి 'అనిమల్' మూవీ!
By: Tupaki Desk | 10 March 2021 7:30 AM GMTటాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా తెరకెక్కించి ఒక్కసారిగా సంచలన దర్శకుడుగా మారాడు సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లోకి రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ అప్పటినుండి సందీప్ రెండో సినిమా ఏంటనే ఆత్రంలో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇంకా అర్జున్ రెడ్డి ఫీవర్ తోనే ట్రావెల్ అవుతున్నాడు సందీప్. సెకండ్ మూవీ తెలుగులో చేస్తాడేమో అనుకుంటే.. హిందీలో కబీర్ సింగ్ చేసాడు. తెలుగులో ఏమోగానీ ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నాడు. ‘కబీర్ సింగ్’ నిర్మాతలతోనే తన తదుపరి సినిమాను తెరకెక్కించబోతున్నాడు సందీప్. ఓ క్రైమ్ ద్రిల్లర్ నేపథ్యంలో సాగే కథను సందీప్ వినిపించడంతో నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
ఇదివరకే సందీప్ బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ ను తన కథతో మెప్పించాడు. ఈ ఇద్దరి మధ్య సింగిల్ సిట్టింగ్‌లోనే కథ ఓకే అవ్వడంతో అసలు క్రైమ్ ఎలా ఉండబోతుందో చూపిస్తానంటూ ఆ మధ్య చెప్పాడు. రణబీర్ కపూర్ తో తీయబోయే సినిమాకు 'అనిమల్' అనే పేరు ఖరారు చేసాడు సందీప్. ఈ సినిమాలో రణబీర్ సరసన పరిణితి చోప్రా హీరోయిన్ గా నటించనుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం అయినట్లు తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. అనిమల్ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి ప్రారంభిస్తారని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. అదికూడా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరుగుతుందని టాక్. టి-సిరీస్ బ్యానర్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. చూడాలి మరి సందీప్ ఈసారి ఎలాంటి బోల్డ్ స్టోరీ చూపిస్తాడో!