Begin typing your search above and press return to search.
బాలీవుడ్ గ్యాంగుతో సందీప్ వంగా
By: Tupaki Desk | 9 April 2019 5:03 PM GMTరీమేక్ సినిమా అంటే చాలు.. పోలికలు తప్పవు. ఏదో కమర్షియల్ సినిమా అయితే పెద్దగా విమర్శలు ఉండవు. కానీ ఒక భాషలో క్లాసిక్ గా నిలిచిన సినిమాను మరో భాషలోకి రీమేక్ చేసే సమయంలో విమర్శకులు కాచుకుని కూర్చుంటారు. ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' రీమేక్ పై అందరి దృష్టి ఉంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వెర్షన్ కు కూడా దర్శకుడన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.
అక్కడక్కడ కొంతమంది కఠినాత్ముల సణుగుడు తప్ప ఓవరాల్ గా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ కు టీజర్ తెగ నచ్చేసింది. ఈ టీజర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచాడు దర్శకుడు. దీంతో సందీప్ ఒక్కడే కాదు.. షాహిద్.. కియారాలు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారట. ఈ సందర్భాన్ని ఒక పార్టీ చేసుకుని మరీ సెలబ్రేట్ చేసుకున్నారట 'కబీర్ సింగ్' టీమ్. పైనున్న ఫోటోలో ఆ సందర్భంలో తీసినదే.
తమిళ రీమేక్ 'వర్మ' విషయంలో ఏమైందో అందరికీ తెలుసు కదా. సినిమా మొత్తాన్ని స్క్రాప్ చెయ్యాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఈ సినిమా టీజర్ రెస్పాన్స్ నిజంగా 'కబీర్ సింగ్' టీమ్ కు కాన్ఫిడెన్స్ ఇచ్చేదే. 'అర్జున్ రెడ్డి' ఒక కల్ట్ ఫిలిం కాబట్టి ఒరిజినల్ లో 80% ను హిందీ రీమేక్ మ్యాచ్ చేయగలిగినా ఒక హిస్టారికల్ ఫీట్ ను రిపీట్ చేయగలిగినట్టే. సందీప్ డైరెక్టర్ కావడంతో డైరెక్షన్ విషయంలో పెద్దగా ట్రబుల్ ఉండదు. పోలికల భారం మోయాల్సి వచ్చేది మాత్రం హీరో షాహిద్ కపూర్ మాత్రమే. ఎందుకంటే నెవర్ బిఫోర్ పెర్ఫార్మెన్స్ తో విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను రిపీట్ చేయడం మాటలు కాదు.