Begin typing your search above and press return to search.
బాహుబలి రేంజ్ లో అర్జున్ రెడ్డి దర్శకుడి ప్లాన్స్
By: Tupaki Desk | 4 Jun 2019 3:30 AM GMTఅర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్' అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ వర్గాల్లో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక వేళ ఈ చిత్రం విజయాన్ని దక్కించుకుంటే మాత్రం సందీప్ రెడ్డి స్థాయి మరింత పెరగడం ఖాయం. ఇదే సమయంలో సందీప్ రెడ్డి భవిష్యత్తులో మహేష్ బాబుతో సినిమ తీయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. మహేష్ బాబుతో తాను తీయాలనుకున్న సినిమా మహేష్ బాబులోని అద్బుత నటుడిని వెలికి తీయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతంకు ఇద్దరం కూడా వేరు వేరు కమిట్ మెంట్స్ ను పెట్టుకుని సినిమాలు చేస్తున్నాం. అవి పూర్తి అయిన తర్వాత మహేష్ మూవీ ఆలోచన చేస్తానంటూ సందీప్ రెడ్డి వంగ పేర్కొన్నాడు. ఇక తన తర్వాత సినిమా గురించి సందీప్ రెడ్డి వంగ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కబీర్ సింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. దాంతో ఆ తర్వాత సినిమా విషయంలో సందీప్ రెడ్డి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లయితే అనిపిస్తుంది. తన తదుపరి చిత్రం ఒక భారీ క్రైమ్ డ్రామా మూవీ అంటూ చెప్పుకొచ్చాడు.
సినిమాలు గొప్పగా ఉంటే భాషలు అనేవి ఒక మ్యాటర్ కాదనే విషయాన్ని బాహుబలి మరియు కేజీఎఫ్ చిత్రాలు నిరూపించాయి. అందుకే తాను కూడా అలాంటి సినిమాలను తీసి అన్ని భాషల ప్రేక్షకులను నచ్చే విధంగా చేయాలనే పట్టుదలతో ఉన్నాడట. ప్రేక్షకులు మంచి కంటెంట్ తో సినిమా తీస్తే బాషతో సంబంధం లేకుండా చూసేస్తున్నారు. అందుకే తన క్రైమ్ డ్రామా మూవీని విభిన్నంగా అందరిని ఆకట్టుకునేలా తీస్తానంటూ సందీప్ వంగ చెప్పుకొచ్చాడు. కబీర్ సింగ్ విడుదల అయితే దాని గురించి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.