Begin typing your search above and press return to search.
అర్జున్ రెడ్డి అతనిది కాదు..
By: Tupaki Desk | 18 Aug 2017 6:01 AM GMTమనం తరుచుగా వింటూ ఉంటాం ఈ కథ పలనా హీరోతో చేయవలిసింది కుదరకో నచ్చకో ఈ హీరో తో చేశాం అని. కానీ ఇలా ఎప్పుడు విన్న ఆ పలనా హీరో చేయకపోవడమే మంచిదిలే అనిపిస్తూ ఉంటుంది. హిందిలో కానీ తమిళంలో కానీ మన తెలుగులో కానీ ఇలా ఒక హీరో చేయవలిసినవి వేరే హీరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇలానే మరోసారి జరిగింది వచ్చే వారం ఆగష్టు 25న విడుదలవబోతున్న అర్జున్ రెడ్డి సినిమాతో.
ఈ సినిమా టీజర్ కానీ విజయ్ దేవరకొండ లుక్ కానీ చూడగానే అందరూ ఈ సినిమాలో ఏదో ఉందే అనే ఆలోచిస్తూ విడుదలైతే ఒకసారి చూద్దాం అని ఫిక్స్ అయ్యారు. థియేట్రికల్ ట్రైలర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కథ ముందు విజయ్ దేవేరకొండకు చెప్పలేదు అంటా డైరెక్టర్ సందీప్ వంగా. “నేను ముందు ఈ కథను ప్రొడ్యూస్ చేయమని చాలామంది దగ్గరకు వెళ్ళాను. ఎవ్వరూ నా కథ పై ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడలేదు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ ద్వారా హీరో శర్వానంద్ ను కలిసి కథ చెప్పాను. శర్వానంద్ కు కూడా ఈ కథ బాగా నచ్చింది. వేరే కారణాలు వలన అతను ఈ కథను చేయలేకపోయాడు. ఆ తరువాత విజయ్ తోను హీరోయిన్ షాలిని తో కొన్ని వర్క్ షాప్ లు చేసిన తరువాత నా పాత్రలుకు ఎవరైతే న్యాయం చేస్తారో అర్ధమైంది. వెంటనే విజయ్ దేవేరకొండతో షూటింగ్ మొదలుపెట్టాను'' అంటున్నాడు.
ఇకపోతే ఈ సినిమా అందరూ అనుకూనట్లు హీరో కోపంపై దాని వలన అతనుకు వచ్చే సమస్యలు పై ఉండదట.. వాటితో పాటు.. చాలా ఎమోషన్లు చెప్పడం జరిగిందట. సినిమా ను ఎక్కువ భాగం మంగుళూరులో.. మిగతా సినిమా అంతా మన హైదరాబాద్ లో కొంత భాగం యూరోప్ లో షూట్షూ చేశారట. అసలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ఒక్క నిర్మాత కూడా ముందుకు రాకపోవడంతో... చివరకు డైరక్టర్ సొంత అన్నయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడట.