Begin typing your search above and press return to search.
కబీర్ సింగ్ తర్వాత సందీప్ రేంజ్ మారడం పక్కా
By: Tupaki Desk | 14 May 2019 5:30 PM GMTటాలీవుడ్ లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు తీసినా కానీ బాలీవుడ్ కు వెళ్తే వచ్చే క్రేజ్ వేరు. హిందీ ఇండస్ట్రీకి వెళ్లి అదరిపోయే హిట్ ఇవ్వడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. రాఘవేంద్రరావు, దాసరి, కృష్ణవంశీ, ఈవీవీ లాంటి దర్శకులు బాలీవుడ్ లో హిట్ ట్రాక్ కోసం ట్రై చేశారు కానీ ఎవ్వరికీ వర్కవుట్ కాలేదు.. ఒక్కరామ్ గోపాల్ వర్మకు తప్ప. వర్మది ఇంటర్నేషనల్ రేంజ్ కాబట్టి బాలీవుడ్ ని చుట్టి అవతల పారేశాడు.
హిందీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే అక్కడి వారి టేస్ట్ తెలిసుండాలి. అప్పుడే హిట్ కొట్టగలం. ఇక అర్జున్ రెడ్డితో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు అర్జున్ రెడ్డినే షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ గా తీశాడు. అసలు కబీర్ సింగ్ అనే టైటిల్ పెట్టడంతోనే సందీప్ సగం సక్సెస్ కొట్టేశాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాను యాజ్ ఇట్ ఈజ్ దించేయడంతో.. కబీర్ సింగ్ సూపర్ సక్సెస్ అవ్వడం ఖాయంగా కన్పిస్తుంది. అదీగాక.. అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమాలు బాలీవుడ్ వాళ్లకు బాగా నచ్చుతాయి.
షాహిద్ కపూర్ కూడా కబీర్ సింగ్ పాత్రలో బాగా ఒదిగిపోయాడు. గతంలో ఉడ్తా పంజాబ్ సినిమాలో కూడా ఇలాంటి డ్రగ్ అడిక్ట్ పాత్ర చేయడంతో.. అభిమానులు అతడ్ని కబీర్ సింగ్ పాత్రలో ఓన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కబీర్ సింగ్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్ కనుక హిందీ యూత్ కి కనెక్ట్ అయితే.. 25 ఏళ్ల క్రితం రంగీలా సినిమాతో వర్మ ఎలా సంచలనం సృష్టించాడో.. ఇప్పడు ఈ కబీర్ సింగ్ సినిమాతో సందీప్ రెడ్డి కూడా అలాంటి సంచలనమే సృష్టిస్తాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తానికి కబీర్ సింగ్ తర్వాత సందీప్ రేంజ్ అమాంతం పెరిగిపోవడం మాత్రం పక్కా.