Begin typing your search above and press return to search.

ఆ రెండు అక్షరాలు వాడొద్దు

By:  Tupaki Desk   |   1 Sep 2017 4:41 AM GMT
ఆ రెండు అక్షరాలు వాడొద్దు
X
యూత్ సినిమాకు కొత్త డెఫినిషన్ ఇస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తున్నాడు అర్జున్ రెడ్డి. రూ. 5.5 కోట్లతో రూపొందిన ఈ సినిమా వసూళ్లు ఇప్పటికే రూ. 20 కోట్లకు చేరువయ్యాయి. హీరో విజయ్ దేవరకొండ ఇమేజ్ ను ఈ సినిమా అమాంతం పెంచేసింది. టాలీవుడ్ లోని పెద్దలంతా ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. అర్జున్ రెడ్డి మూవీ డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా టాలెంట్ కు అంతటా మంచి అప్రిషియేషన్ దక్కుతోంది.

సినిమా పేరులోనే క్యాస్ట్ పెట్టి మరీ తీసిన సందీప్ ఉన్నట్టుండి తన స్టయిల్ మార్చాడు. తాజాగా వీలైనంత వరకు క్యాస్ట్ ఐడెంటిటీని దాచే ప్రయత్నం చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా రిలీజయిన టైంలో పోస్టర్లలో డైరెక్టర్ పేరు సందీప్ రెడ్డి అని కనిపించింది. లేటెస్ట్ గా కనిపిస్తున్న పోస్టర్లలో మాత్రం రెడ్డి అనే పదం లేకుండా కేవలం సందీప్ వంగా అని మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు గోడలపై కనిపిస్తున్న అన్ని పోస్టర్లలోనూ ఇదే పేరు ఉంటోంది. హైలీ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరొచ్చిన టైంలో పేరు మార్చుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆరా తీస్తే తన ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నాడని తెలుస్తోంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో కలిసి పనిచేయడానికి ముందుముందు ఇబ్బందులు ఎదురవకుండా ఈ ముందు జాగ్రత్త పడుతున్నాడని టాక్. ఇతర కమ్యూనిటీలకు చెందిన హీరోలకు డైరెక్షన్ చేయాలన్న ఆలోచనతో వ్యూహాత్మకంగానే ఈ స్టెప్ తీసుకున్నాడు. అందుకే మీడియా పర్సన్స్ తో మాట్లాడేటప్పుడు కూడా తన పేరులో ఉన్న రెడ్డి అనే అక్షరాలు ఇగ్నోర్ చేయాల్సిందిగా కోరుతున్నాడు.

సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ ప్రభావం ఎక్కువే అనేది కాదనలేని నిజమే అయినా టాలెంట్ ఉంటే వాటన్నింటిని దాటేయడం పెద్ద కష్టం కాదు. కోదండరామిరెడ్డి - శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి అదే పేరుతో క్లిక్కయి.. ఎంతో పైకొచ్చారు. వాళ్లు అగ్రహీరోలందరితోనూ పని చేశారు. సందీప్ మాత్రం ఈ విషయంలో డిఫరెంట్ గా ఆలోచిస్తన్నట్టున్నాడు. లేకపోతే ఇప్పుడున్న వివాదాలు సరిపోయాయ్... ఇంకా కొత్తవి మనకెందుకనా?