Begin typing your search above and press return to search.

కబీర్ సింగ్ తర్వాత నెక్స్ట్ అదేనట

By:  Tupaki Desk   |   21 Jun 2019 7:47 AM GMT
కబీర్ సింగ్ తర్వాత నెక్స్ట్ అదేనట
X
ఇవాళ భారీ అంచనాల మధ్య అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ వచ్చేసింది. రిపోర్ట్స్ ఇంకా క్లారిటీగా రావాల్సి ఉంది కానీ ప్రాధమికంగా పాజిటివ్ గానే ఉన్నాయి. ఇదిలా ఉంచితే తెలుగులో స్ట్రెయిట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న సందీప్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనిపించేలా నెక్స్ట్ మూవీ ఓ క్రైమ్ థ్రిల్లర్ ని తెలుగులోనే ప్లాన్ చేస్తున్నాడట. హీరో ఎవరు టీమ్ ఏంటి లాంటి వివరాలు తెలియవు కానీ త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

నిజానికి సందీప్ మహేష్ బాబుకో లైన్ చెప్పాల్సి ఉంది. ఒకవేళ అది కనక బాగా నచ్చితే సరిలేరు నీకెవ్వరు తర్వాత ప్రిన్స్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే ఛాన్స్ లేకపోలేదు. కానీ అదంత ఈజీ కాదు. మహేష్ మాత్రం అర్జున్ రెడ్డి టైం నుంచే ఇతని మీద ఆసక్తిగా ఉన్నాడు. ఒకవేళ అది ఆలస్యం అయినా స్టోరీ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోయినా క్రైమ్ థ్రిల్లర్ తో ప్రొసీడ్ అవ్వొచ్చన్న మాట.

ఇంటెన్సిటీని తెరమీద చూపించడంలో ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన సందీప్ వంగా ఇలాంటి జానర్ ను టచ్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. ప్రస్తుతం కబీర్ సింగ్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఇతను ఇంకొద్ది రోజుల్లో ఫ్రీ అయిపోతాడు. ఎందరు పిలుస్తున్నా రెండేళ్ల నుంచి అన్ని హోల్డ్ లో పెట్టిన సందీప్ ఇకపై స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చింది. అర్జున్ రెడ్డి వచ్చి రెండేళ్లు దాటుతోంది. కబీర్ సింగ్ రీమేక్ కాబట్టి మనకు కౌంట్ లోకి రాదు. ఇప్పుడీ మూడో సినిమా మాత్రం మల్టీ లాంగ్వేజ్ లో ప్లాన్ చేసే ఆలోచనలో సందీప్ ఉన్నట్టుగా ఇన్ సైడ్ టాక్