Begin typing your search above and press return to search.

కబీర్ సింగ్ దర్శకుడి కొత్త లాజిక్

By:  Tupaki Desk   |   9 July 2019 4:48 AM GMT
కబీర్ సింగ్ దర్శకుడి కొత్త లాజిక్
X
బాలీవుడ్ మీడియా కత్తిగట్టి మరీ నెగటివ్ ప్రచారం చేసినా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి రెండు వందల కోట్లు రాబట్టేసింది. ఊహించిందాని కన్నా ఇది రెండు మూడు రెట్లు పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్ రన్ పూర్తి కాలేదు కాబట్టి భారత్-యుఆర్ ఐ రికార్డులను ఈజీగా బద్దలు కొడుతుందని ట్రేడ్ అంచనా. ఈ నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచి మీడియాకు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈసారి ప్రత్యేకంగా రివ్యూలను టార్గెట్ చేశాడు.

సరిగా ఇంగ్లీష్ బాష రానివాళ్లు కూడా సినిమాలను మొదటి రోజు మొదటి ఆట చూసి తమకు ఇష్టం వచ్చిన రీతిలో రివ్యూలు పెడుతున్నారని దాని వల్ల ప్రేక్షకుల మీద ప్రభావం పడి వసూళ్లు తగ్గుతున్నాయని వీటిని వారం తర్వాత మాత్రమే రాసేలా వ్యవస్థలో మార్పు రావాలని కొత్త లాజిక్ చెప్పాడు. ఒక ఫిలిం మేకర్ గా అందులోనూ కంటెంట్ ఉన్న సినిమాకు ఆకారణంగా విమర్శలను ఎదురుకున్న దర్శకుడిగా సందీప్ అడిగినదాంట్లో పాయింట్ ఉంది. కానీ ప్రజాస్వామ్య దేశంలో దేని గురించైనా ఎవరి గురించైనా కామెంట్ చేసే హక్కు రివ్యూ రూపంలో మీడియాకు తెలియజేసే హక్కు ఉంటుంది.

దీనికి సినిమా మినహాయింపు కాదు. కోట్లు ఖర్చు పెట్టి నిర్మాత తీసినా టికెట్ కొనే ప్రేక్షకుడు కూడా చెమట చిందించే దాన్ని స్వార్జితంతో కొనుక్కుంటాడు. బాగుంటే తల మీద పెట్టుకుంటాడు. బాలికపోతే పనిగట్టుకుని ప్రచారం చేస్తాడు. అది అతని హక్కు. రివ్యూ రాసేవాళ్ళు దాన్ని వృత్తిగా చేస్తారు అంతే తేడా. అంతమాత్రాన సినిమాల జయాపజయాలు వీటి మీదే ఆధారపడి ఉంటాయనుకోవడంలో లాజిక్ లేదు. మరి ముంబై మీడియా వన్ రేటింగ్ ఇచ్చిన కబీర్ సింగ్ కు రెండు వందల కోట్లు ఎలా వచ్చాయి. ఇది కొలిక్కి వచ్చే వ్యవహారం కాదు కానీ ఎవరి పని వారిదే అనే తరహాలో దీన్ని అలా వదిలేయడమే బెటర్