Begin typing your search above and press return to search.

చరణ్ ఆగట్లేదుగా.. చాలా సెట్ చేశాడు

By:  Tupaki Desk   |   1 April 2018 5:00 AM IST
చరణ్ ఆగట్లేదుగా.. చాలా సెట్ చేశాడు
X
ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోతో అయినా గట్టిగా ప్రయత్నిస్తే దర్శకులు డేట్స్ అందుకోవచ్చు. కానీ ఒకే ఒక్క హీరోతో అనుకుంటే మాత్రం ఇప్పట్లో సినిమా చేయలేరు. ఓ నాలుగేళ్ళ వరకు ఆ హీరో కథలను ఒకే చేసేలా కనిపించడం లేదు. అతను ఎవరో ఇప్పటికే ఒక ఐడియా వచ్చిందనుకుంటా.. రంగస్థలం సినిమాతో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని పరుగులు పెట్టిస్తున్న రామ్ చరణ్ పార్టీలతో చాలా బిజీగా ఉన్నాడు. సక్సెస్ ని అందరికంటే ఎక్కువగా తానే ఎంజాయ్ చేస్తున్నాడు.

ముఖ్యంగా స్టార్ దర్శకులతో కలిసి తన ఇంట్లోనే మెగా పవర్ స్టార్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి - సందీప్ రెడ్డి వంగ - సుకుమార్ లతో కలిసి హ్యాపీ ముమెంట్స్ ని సరదాగా పంచుకుంటున్నాడు. అయితే ఈ పార్టీకి ఈ ముగ్గేరే ఎందుకు వచ్చారనే ఆలోచన రావచ్చు. సుకుమార్ రంగస్థలం చేశాడు కాబట్టి వచ్చాడు. వంశీ పైడిపల్లితో చరణ్ కి ఇంతకుముందు నుంచే పరిచయం ఉంది. వారి కలయికలో ఎవడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అర్జున్ రెడ్డి దర్శకుడు ఎందుకు వచ్చాడు అంటే.. రీసెంట్ గా ఈ హార్డ్ డైరెక్టర్ చరణ్ కి ఒక కాన్సెప్ట్ చెప్పి మెప్పించాడు.

త్వరలోనే ఆ సినిమా గురించి ఎనౌన్స్ చేస్తారట. ఇక వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ కూడా ఒకే అయినట్లు టాక్ వస్తోంది. వీరితో పాటు చరణ్ రాజమౌళి - బోయపాటి లాంటి స్టార్ దర్శకులతో కూడా వర్క్ చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే మెగా పవర్ స్టార్ చక్కగా చాలా ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడనే అనుకోవాలి.