Begin typing your search above and press return to search.

మహేష్ మెకానిక్ అవుతాడా?

By:  Tupaki Desk   |   16 Feb 2018 4:13 PM IST
మహేష్ మెకానిక్ అవుతాడా?
X
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా అందరిని ఆకర్షించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. సినిమా బాక్స్ స్థాయిలో వసూళ్లు సాధించడమే కాకుండా ఇతర నటి నటులు ప్రశంసలను అందించారు. చాలా వరకు సినిమాకి ఫిదా అయిపోయారు. ముఖ్యంగా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ చాలా రోజుల తరువాత బయట చిత్రాలను ఓ రేంజ్ పొగిడాడు. అలాగే దర్శకుడిపై మహేష్ మనసు పారేసుకున్నాడని అయన చేసిన ట్వీట్ ని బట్టి చెప్పవచ్చు.

అయితే సందీప్ కొన్ని సార్లు మహేష్ ని కలవడం జరిగింది. దీంతో వారిద్దరి కలయికలో సినిమా రాబోతోందని ఓ రేంజ్ లో వార్తలు వచ్చాయి. అసలైతే సందీప్ మహేష్ కు ఒక కాన్సెప్ట్ కు సంబందించిన లైన్ ని కొంచెం సేపు వివరించాడట. బైక్ మెకానిక్ చుట్టూ ఆ కథ తిరుగుతుందట. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కానీ ఎక్కువగా బైక్ మెకానికి వృత్తిని బేస్ చేసుకొని ఉండడంతో మహేష్ కొంచెం ఆలోచించాడట.

కాన్సెప్ట్ విన్న మహేష్ నో అని మాత్రం చెప్పలేదట. దీంతో దర్శకుడు కథను డెవెలప్ చేసే పనిలో పడ్డాడు. మహేష్ స్టార్ డమ్ కి తగ్గట్టుగా మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సందీప్ తన రెండవ కథను ఇంకా ఎవరితోనూ ఫైనల్ చేయలేదు. మహేష్ ని మెప్పిస్తే మాత్రం తప్పకుండా అదే రెండవ సినిమా అవుతుంది. అయితే మహేష్ భరత్ అనే నేను అయిపోగానే వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. మరి సందీప్ రెడ్డి వంగ కాన్సెప్ట్ ని ఎప్పుడు ఒకే చేస్తాడో చూడాలి.