Begin typing your search above and press return to search.
సందీప్ వంగాతో చిరు.. మరో బంచ్ ని పరిచయం చేస్తారా?
By: Tupaki Desk | 25 April 2021 3:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి మొదటి లాక్ డౌన్ లో నలుగురు దర్శకులతో సినిమాల్ని ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ నలుగురిని మీడియా ముఖంగా పరిచయం చేశారు. కొరటాలతో ఆచార్య.. తని ఒరువన్ మోహన్ రాజాతో లూసీఫర్ రీమేక్ ని ఖాయం చేశారు. ఆచార్య చిత్రీకరణ సాగుతోంది. మోహన్ రాజా స్క్రిప్టు ఫైనల్ టచప్ లో ఉన్నారని సమాచారం.
అలాగే మెహర్ రమేష్ - బాబీలతోనూ సినిమాలు చేస్తున్నానని చిరు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ఉప్పెన ప్రచారం వేదికపై బాబి- మైత్రి సంస్థ మూవీని మరోమారు కన్ఫామ్ చేశారు. బాబీతో స్ట్రెయిట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెహర్ తో వేదాళం రీమేక్ పనులు సాగుతున్నాయి. సెకండ్ వేవ్ లో ఆచార్య చిత్రీకరణకు బ్రేకిచ్చి స్వయం లాక్ డౌన్ విధించుకున్న మెగాస్టార్ ఇప్పుడు వేరే స్క్రిప్టులపైనా దృష్టి సారించారని సమాచారం. వరుసగా మరో బంచ్ దర్శకుల్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట.
ఇంతకుముందు స్క్రిప్టు దశల్లో చిరుని ఒప్పించలేకపోయిన వినాయక్.. వంశీ పైడిపల్లి.. సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు రేస్ లో ఉన్నారు. అయితే వీళ్లందరిలోనూ సందీప్ రెడ్డితో స్క్రిప్టును ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నారని సమాచారం. బాలీవుడ్ లో రణబీర్ కథానాయకుడిగా యానిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సందీప్ రెడ్డి తదుపరి చిరుకు స్క్రిప్టును వినిపిస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే కథాచర్చలు సాగనున్నాయట. స్క్రిప్టుతో మెప్పిస్తే ఈ సినిమా ఫైనల్ అయినట్టేనన్న టాక్ కూడా వినిపిస్తోంది.
మరోవైపు వీవీ వినాయక్.. పైడిపల్లి వినిపించిన కథలు ఇంతకుముందు రిజెక్ట్ అయ్యాయి. వినాయక్ ఒప్పించలేకపోవడంతోనే మోహన్ రాజాకు రీమేక్ ఆఫర్ వెళ్లింది. ఇక పైడిపల్లి తన స్క్రిప్టుతో ఒప్పించడంలో తడబడ్డారని ప్రచారమైంది. అయినా వినాయక్.. పైడిపల్లి లాంటి సీనియర్లకు ఆఫర్లు ఎప్పుడూ ఉంటాయి. ఇన్నోవేటివ్ కథలు బౌండ్ స్క్రిప్టుతో ఒప్పించగలిగితే చిరుతో అవకాశం ఉంటుంది. మొదటి వేవ్ సమయంలో నలుగురిని ఫైనల్ చేసిన చిరు.. సెకండ్ వేవ్ లో మరో నలుగురు దర్శకుల బంచ్ ని పరిచయం చేస్తారేమో చూడాలి.