Begin typing your search above and press return to search.

ఇద్దరు పిల్లల తండ్రని తెలిసి నమ్మాను.. ఆపై మోస పోయాను

By:  Tupaki Desk   |   8 Nov 2021 2:30 AM GMT
ఇద్దరు పిల్లల తండ్రని తెలిసి నమ్మాను.. ఆపై మోస పోయాను
X
బాలీవుడ్‌ కు చెందిన సంగీత బిజ్ లానీ గురించి 1990 సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎంతో మంది కలల రాణిగా నిలిచారు. ఆ కలల రాణి మొదట సల్మాన్ ఖాన్ ప్రేమలో పడింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కంటే సంగీత సీనియర్. అయినా కూడా సల్మాన్ ఖాన్‌ తన ప్రేమను చాలా నిజాయితీగా చెప్పడంతో సంగీత కాదనలేక పోయింది. ఇద్దరి ప్రేమ వ్యవహారం పెద్దల వరకు వెళ్లింది. పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. నిశ్చితార్థం జరిగింది.. పెళ్లికి ముహూర్తం ఖరారు చేసి శుభ లేఖలు అచ్చు కూడా అయ్యాయి. ఆ సమయంలో ఇద్దరి మద్య వ్యవహారం చెడింది. ఒక వైపు సంగీతతో పెళ్లికి సిద్దం అయిన సల్మాన్ ఖాన్‌ మరో వైపు ఒక అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడు. ఆ విషయం స్వయంగా సంగీత కంట పడింది. ఆ సమయంలో ఆమెకు సమాధానం చెప్పలేక పోయాడు. సంగీత కూడా పరిస్థితిని అర్థం చేసుకుని సల్మాన్ తో నిశ్చితార్థం క్యాన్సిల్‌ చేసుకుంది.

సల్మాన్ నుండి దూరం అయిన తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సంగీత జీవితంలోకి అనూహ్యంగా టీం ఇండియా ఆటగాడు అయిన అజారుద్దీన్ ఎంట్రీ ఇచ్చాడు. ఒక యాడ్‌ ఫిల్మ్ షూటింగ్‌ సందర్బంగా వీరిద్దరు కలుసుకున్నారు. సంగీతను మొదటి చూపులోనే అజారుద్దీన్ ప్రేమించాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆమె కూడా ఒప్పుకుంది. కాని అప్పటికే అజారుద్దీన్ కు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ విషయం సంగీతకు తెలియంది కాదు. అయినా కూడా ఆయన ప్రేమలో పడింది. సంగీత మరియు అజారుద్దీన్ ప్రేమ వ్యవహారం చాలా దూరం వరకు వెళ్లింది. ఆ సమయంలో అజారుద్దీన్ భార్య నౌరీన్ కు విషయం చేరింది. ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా అని అజారుద్దీన్ వెళ్లి తన ప్రేమ విషయాన్ని క్లీయర్ గా చెప్పేశాడు. ఇకపై తన జీవితాన్ని సంగీతతో పంచుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పేశాడు.

సంగీత మరియు అజారుద్దీన్ ల మద్య నౌరీన్ ఉండాలనుకోలేదు. అతడిని బలవంతంగా తనతో ఉంచుకున్నా వారి ప్రేమను తుంచలేమని భావించింది. అందుకే నౌరీన్ విడాకులు తీసుకుని వెళ్లి పోయింది. దాంతో అజారుద్దీన్ మరియు సంగీల మద్య ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లింది. ఇద్దరు 14 ఏళ్ల పాటు కాపురం సాగించారు. అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో అజారుద్దీన్ మరో అమ్మాయి ప్రేమలో పడ్డాడు అంటూ సంగీతకు తెలిసింది. ఆ విషయాన్ని అజారుద్దీన్‌ ఒప్పుకోలేదు. నేను మరో అమ్మాయితో ప్రేమలో లేను అన్నాడు. కాని సంగీత మాత్రం నమ్మలేదు. తాను వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్లుగా చెప్పేసింది. అందుకు అజారుద్దీన్ కూడా ఒప్పుకున్నాడు. అలా అజారుద్దీన్ తో తన ప్రేమ వ్యవహారం చెడిపోయింది అంటూ స్వయంగా సంగీత తన బ్లాగ్ లో రాసుకుంది.