Begin typing your search above and press return to search.
తమ్ముడితో రొమాన్స్ వద్దనుకున్నా
By: Tupaki Desk | 28 May 2018 11:30 PM GMTకొన్ని సినిమాల జ్ఞాపకాలు ఎన్నేళ్ళైనా వెంటాడుతూనే ఉంటాయి. అందులో నటీనటులు వాటి తాలూకు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇలా చేశామా అని ఆశ్చర్యం కలిగించే సంఘటనలు కూడా గుర్తొస్తాయి. నిన్నా మొన్నటి దాకా సినిమాల్లో కనిపించిన హీరోయిన్ సంగీత పన్నెండేళ్ల క్రితం విడుదలైన ఒక వివాదాస్పద సినిమా గురించి ఓపెన్ అయ్యింది. దాని పేరు ఉయిర్. తెలుగులోకి మనోహరా పేరుతో డబ్ చేసారు. భర్తకు తెలియకుండా అతని తమ్ముడి మీద మోజు పడి కామించే పాత్రలో సంగీత సెన్సేషన్ సృష్టించింది . తమిళనాడులో మహిళా సంఘాలు అప్పట్లో దీని మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాయి. వాటి సంగతి ఎలా ఉన్నా సినిమా మాత్రం హిట్ అయ్యింది. రోజా పూలుతో మనకు హీరోగా పరిచయమున్న శ్రీరామ్ ఈ మధ్యే లైలో నితిన్ ఫ్రెండ్ గా కీలకపాత్ర ఒకటి చేసాడు. దాని ముచ్చట్లే సంగీత ఒక ఇంటర్వ్యూ లో షేర్ చేసుకుంది.
స్టోరీ లైన్ విన్నప్పుడు షాక్ తిన్నానని, అదే రోజు ఉదయం వేరే సమస్య మీద డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక మహిళ కేసు గురించి ఆయన చెప్పడం సరిగ్గా అదే రోజు సాయంత్రం దర్శకుడు ఈ కథతో రావడం ఇప్పటికీ మర్చిపోలేను అంటోంది. అమ్మతో కలిసి ఈ సినిమా చూడడానికి ధియేటర్ కు వెళ్లిన సంగీత ఆవిడ పక్కన కూర్చుని తనను తాను చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యిందట. లేచి వెళ్ళిపోదాం అనుకుంటే అమ్మనే ఆపి మొత్తం సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారట. మొత్తానికి సంగీత ఈ విషయం చెప్పాక ఆ సినిమా చూడాలి అనిపిస్తోంది కదూ. ఖడ్గం-పెళ్ళాం ఊరెళితే- బహుమతి- సంక్రాంతి లాంటి చెప్పుకోదగ్గ సినిమాలు చేసిన సంగీత ఎందుకో తెలుగులో ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఇప్పుడు ఈ జ్ఞాపకాన్ని పంచుకోవడం ద్వారా మర్చిపోయిన ఆ సినిమాను ఆన్ లైన్ లో వెతికే పనిలో పడ్డారు అభిమానులు