Begin typing your search above and press return to search.
లెజెండరీ డైరెక్టర్ టీవీలోకొచ్చాడు
By: Tupaki Desk | 6 July 2017 3:35 PM GMTబుల్లితెరపై సినిమా వాళ్లకు చాలా చిన్న చూపు ఉండేది ఇంతకుముందు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీల సెలబ్రెటీలు టీవీని తక్కువగా చూసేవాళ్లు. కానీ బాలీవుడ్ హీరోలు.. దర్శకులు బుల్లితెర స్థాయిని పెంచి.. అక్కడ మంచి రెవెన్యూ రాబట్టడం.. భారీగా పారితోషకాలు అందుకోవడం.. తమ స్టేచర్ మరింతగా పెంచుకోవడంతో మన వాళ్ల మైండ్ సెట్ మారింది. ఇప్పుడు ఒక్కొక్కరుగా స్టార్ హీరోలు బుల్లితెర హోస్ట్ లుగా మారుతున్నారు. అక్కినేని నాగార్జున.. మెగాస్టార్ చిరంజీవి.. జూనియర్ ఎన్టీఆర్.. దగ్గుబాటి రానా.. ఇలా ఒక్కొక్కరుగా టీవీ రంగంలోకి అడుగుపెట్టేశారు. అలాగే కొందరు సీనియర్ దర్శకులు కూడా బుల్లితెరపై ఆసక్తికర కార్యక్రమాలు చేస్తున్నారు.
దర్శకుడిగా ఉన్నంత కాలం మౌనమునిగా పేరు తెచ్చుకున్న రాఘవేంద్రరావు ఈటీవీలో ‘సౌందర్య లహరి’ పేరుతో ఆసక్తికర కార్యక్రమం నిర్వహించారు. తన సినిమాలకు సంబంధించి ఆసక్తికర విశేషాలతో అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే మరో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు బుల్లితెరలోకి వస్తున్నారు. ఆయన తన ఆల్ టైం క్లాసిక్ మూవీ ‘పుష్పక విమానం’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాఘవేంద్రరావు తరహాలోనే సింగీతం కూడా తన సినీ ప్రయాణంలో మైలురాళ్ల గురించి ఈ కార్యక్రమంలో వివరించనున్నారు. ‘పుష్పక విమానం’తో పాటు అపూర్వ సహోదరులు.. ఆదిత్య 369.. భైరవ ద్వీపం లాంటి అద్భుత చిత్రాలతో భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు సింగీతం. ఆయన ఆ క్లాసిక్స్ గురించి చెబుతుంటే వినడం సినీ ప్రియులకు ఆసక్తి రేకెత్తించేదే. జులై 9 నుంచి ఈటీవీలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ‘పుష్పక విమానం చూడొచ్చు.