Begin typing your search above and press return to search.
సంఘమిత్ర.. ఆర్టు వర్కుతో నమ్మేస్తారా??
By: Tupaki Desk | 19 May 2017 5:41 AM GMTఇప్పుడు 'బాహుబలి'ని ఢీకొట్టే సినిమా ఒకటి తీయాలని ఇండియాలో చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ తమిళంలో విజయ్ పులి అంటూ ఒక సినిమా చేశాడు. ఆ తరువాత హిందీలో కూడా బాజీరావ్ మస్తాని వంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడేమో రితీశ్ దేశ్ముఖ్ శివాజి కథ తీస్తానని 200 కోట్ల బడ్జెట్ తో తిరుగుతున్నాడు. ఇప్పుడు తమిళ డైరక్టర్ సుందర్ కూడా అదే పని చేశాడు.
నిన్న చాలా గ్రాండ్ గా కేన్స్ చలనచిత్రోత్సవం ఈవెంట్లో మనోళ్ళు ''సంఘమిత్ర'' సినిమాను లాంచ్ చేశారు. టైటిల్ రోల్ ను శృతి హాసన్ పోషిస్తుండగా.. జయం రవి.. ఆర్య హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను 200 కోట్లతో గ్రాండుగా రూపొందిస్తున్నాం అని చెప్పడానికి మనోళ్ళు మాంచి ఆర్టు వర్కుతో కూడిన ఒక రెండు పోష్టర్లు డిజైన్ చేయించారు. నిజానికి ఇలా రియలిస్టిక్ గా ఫోటోలు తీయాలంటే అది చాలా పెద్ద విషయం. మరి కేవలం ఆర్టు వర్కు చేయించేసి.. ఈ ఫ్యాంటసీ ఆర్ట్ చూసి మీరు నమ్మేయండి అంటే అందరూ ఈ సినిమా బాహుబలి రేంజ్ ప్రాజెక్ట్ అని నమ్మేస్తారా?
అసలు ఇలాంటి హంగామా ఏమీ చేయకుండా.. ముందు షూటింగ్ మొదలుపెట్టి.. గ్రాండుగా సినిమాను తీసి.. టీజర్లతో ప్రమోషన్ స్టార్ట్ చేస్తే.. ప్రాజెక్టుకు హైప్ ఆటోమ్యాటిక్ గానే వస్తుంది. సో సంఘమిత్ర టీమ్ అది గుర్తుపెట్టుకోవాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/