Begin typing your search above and press return to search.

సంఘవి పెళ్లి.. ఎట్టకేలకు నిజమే

By:  Tupaki Desk   |   3 Feb 2016 3:58 PM GMT
సంఘవి పెళ్లి.. ఎట్టకేలకు నిజమే
X
ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆమె పెళ్ళి వార్తలు వచ్చిన కూడా.. హీరోయిన్‌ సంఘవి మాత్రం వాటిని ఖండిస్తూనే ఉంది. పైగా అలాంటి వార్తలొచ్చినప్పుడల్లా ఆమె రూమర్లను పెంచి పోషిస్తున్నారంటూ చాలామంది దుర్భాషలాడింది కూడా.

ఎట్టకేలకు ఈరోజు ఉదయం వచ్చిన సంఘవి మ్యారేజ్‌ రూమర్‌ మాత్రం ఫైనల్‌ గా నిజమైంది. బెంగుళూరుకు చెందిన ఎన్‌.వెంకటేష్‌ అనే ఐటి కంపెనీ సి.ఇ.ఓ. తో సంఘవి వివాహం ఈరోజు ఉదయం బెంగుళూరులోని హోటల్‌ తాజ్‌ వివాంటాలో జరిగింది. ఈ విషయాన్ని కన్ఫామ్‌ చేస్తూ స్వయంగా సంఘవి మీడియాకు కొన్ని ఫోటోలను కూడా పంపిందిలేండి. సో.. ఫైనల్‌ గా ఒక ఇంటిది అయిపోయిందనమాట.

దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన సంఘవి 1977, అక్టోబర్‌ 4న జన్మించినట్లు కొన్ని పాత మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే సంఘవి మాత్రం చాలా కాలం నుండి తన వయస్సు కేవలం 33 అంటూ చెప్పడం గమనార్హం.