Begin typing your search above and press return to search.

హద్దులు దాటిన లూసిఫర్ పాప పరువాలు

By:  Tupaki Desk   |   16 Feb 2023 6:00 AM GMT
హద్దులు దాటిన లూసిఫర్ పాప పరువాలు
X
సానియా అయ్యప్పన్ ఈ పేరు చాలా కొద్ది మందికి మాత్రమే సుపరిచితం. కానీ మాల్ లో ఫ్యాన్స్ ను కొట్టిన హీరోయిన్ అనగానే టక్కున గుర్తొస్తుంది. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన లూసిఫర్ మూవీలో నటించింది ఈ మలయాళీ బ్యూటీ సానియా అయ్యప్పన్. ఆ తర్వాత మలయాళంలో పలు సినిమాల్లోనూ నటించింది.

లూసీఫర్ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ ఈ కేరళ కుట్టీకి మంచి పేరు తీసుకురాలేదు. ఈ హాట్ బ్యూటీ మాత్రం సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. తరచూ తన గ్లామరస్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్రకారుకు దగ్గరవుతోంది.

ప్రస్తుతం సానియాకు ఇన్ స్టాగ్రామ్ లో 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఏటైనా టూర్లకు వెళ్లినా, సినీ ఈవెంట్స్ కు వెళ్లినా ఆ పిక్స్ ను పోస్టు చేస్తుంటుంది. చీర లాంటి ట్రెడిషనల్ వేర్ నుండి హాట్ హాట్ బికినీల వరకు తన అందాల ప్రదర్శన మరో రేంజ్ లో ఉండేట్లు చూసుకుంటోంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. బ్లాక్ గౌన్ లో పరువాలు ఒలకబోసింది. బుర్జ్ అల్ అరబ్ బిల్డింగ్ ముందు రెస్టారెంట్ లో దిగిన పిక్స్ లో సానియా అయ్యప్పన్ అందాల విందు ఓ రేంజ్ లో ఉంది. తన ఎద అందాలను ప్రదర్శిస్తూ ఫోజులిచ్చింది.

సానియా అయ్యప్పన్ ఆ మధ్య తాను నటించిన సాటర్ డే నైట్స్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ హాట్ బ్యూటీ చేసిన ఓ పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రచారంలో భాగంగా హీరో హీరోయిన్స్ ఇతరు నటీనటులు కేరళ కోజికోడ్ లోని హిలైట్ మాల్ కు వెళ్లారు. వారిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు.

ఈ సమయంలో ఓ ఆకతాయి సానియా అయ్యప్పన్ ప్రైవేట్ పార్ట్స్ ను తాకేందుకు ప్రయత్నించాడు. ఊహించని ఈ ఘటనతో షాక్ కు గురైన సానియా, అంతలోనే తేరుకుని అతడి చెంప చెళ్లుమనిపించింది. తాను లైంగిక దాడిని ఎదుర్కొన్నానని ఇన్ స్టాగ్రామ్ వేదికగా సానియా ఓ పోస్టు పెట్టింది.