Begin typing your search above and press return to search.
'భార్యకు బానిస' ట్వీట్ పై సానియా వివరణ
By: Tupaki Desk | 8 May 2020 12:30 AM GMTటీ20 ప్రపంచకప్ - 2020 సందర్భంగా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ను ఉద్దేశించి భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా చేసిన ‘భార్యకు బానిస’ ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘జోరు కా గులాం’ (భార్యకు బానిస) అంటూ ఆమె చేసిన ట్వీట్ పై ఇప్పుడు వివరణ ఇచ్చారు సానియా. ఆస్ట్రేలియాతో భారత్ తలపడిన ఆ మ్యాచ్ కు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వన్డే మ్యాచ్‌కు డుమ్మా కొట్టి మరీ తన భార్య మహిళా క్రికెట్ స్టార్ హీలీ కోసం మ్యాచ్ ను వీక్షించేందుకు రావడంపై సానియా ఈ ట్వీట్ చేశారు. భారత మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్ - స్మ్రితి మంధానల యూట్యూబ్ చానల్ డబుల్ ట్రబుల్ లో తన ట్వీట్ కు అర్థం చెప్పింది సానియా.
సాధారణంగా భర్తలు ఏదైనా సాధిస్తే అది వారి గొప్పతనంగా భావిస్తారని.. ఒకవేళ సాధించకపోతే వారి భార్యల వల్లే సాధించలేకపోయారంటూ సమాజం అంటుందని సానియా చెప్పుకొచ్చింది. వారు అలా ఎందుకు అంటారో తనకు అర్ధం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మనం జోక్ అని చెప్పుకున్నా.. లోతైన విషయం ఉందని అన్నారు. మహిళను బలహీనతగా సమాజం చూపుతుందని.. బలంగా భావించదని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఈ తత్వం మారాలని ఆమె అభిప్రాయపడింది. దీనికి ఎలాంటి ఆధారం లేకపోయినా తరతరాలుగా ఇలాగే కొనసాగుతోందని.. ఆ విషయం తనకు అనుష్క శర్మకు బాగా తెలుసని వివరించింది.
'ఒకవేళ మా భర్తలు ఆడే మ్యాచ్ చూద్దామని మేము వచ్చామనుకోండి. ఆ మ్యాచ్‌లో వారు సరిగా ఆడలేకపోయారనుకోండి. ఇక అంతే మా కారణంగానే ఆడలేకపోయారని ఎన్ని మాటలు అంటారో.. భార్య మ్యాచ్ చూడడానికి స్టార్క్ వచ్చినట్లు నేను ఆడే టెన్నిస్ మ్యాచ్‌కు షోయబ్ వస్తే ఇక అతడిని వదిలిపెట్టరు. భార్యకు బానిసగా మారాడంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడతారు.. అందుకే స్టార్క్‌ను అలా సంబోధించానని, అతను మహిళా క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లేంతగా భార్యకు దాసోహం అయ్యాడని ముద్ర వేస్తారని తాను అలా చమత్కరించానని' సానియా వెల్లడించింది.