Begin typing your search above and press return to search.

'మన ఇద్దరి చెస్ట్ బాగుంటుంది' అనేసిన సానియా

By:  Tupaki Desk   |   17 Aug 2017 4:02 AM GMT
మన ఇద్దరి చెస్ట్ బాగుంటుంది అనేసిన సానియా
X
సాధారణంగా సెలబ్రెటీలు మరొక సెలబ్రెటీల గురించి పాజిటివ్ గానే మాట్లాడతారు. అంతే కాకుండా ఏవైనా కాంట్రవర్సీ విషయాలు ఉంటె మాత్రం అస్సలు వాటి జోలికి వెళ్లకుండా మ్యాటర్ ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వేరొకరి అనుమతి లేకుండా వాటి గురించి ప్రస్తావించడానికి ఏ మాత్రం ఇష్టడపడరు. కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మాట అనేసి తర్వాత కొంచెం ఆలోచనలో పడతారు. అదే తరహాలో సానియా కి కూడా అనుభవం ఎదురైందట. అంతే కాకుండా ఆ ఘటనతో ఆమెకు పరిణితి చోప్రాతో మంచి స్నేహ బంధం కూడా ఏర్పడింది.

టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా మరియు బాలీవుడ్ యాక్టర్ పరిణితి చోప్రా మంచి ఫ్రెండ్స్. వీరి బంధం గురించి బాలీవుడ్ లో అందరికి తెలిసిన విషయమే. అయితే వీరి ఫ్రెండ్షిప్ ఎలా మొదలైందని నేహా ధూపియా ఓ ఇంటర్వ్యూలో పరిణితి చోప్రాతో ని అడిగి తెలుసుకుంది. ఓ ఇంటర్వ్యూలో సానియా తన బయో పిక్ లో పరిణితి చోప్రా అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పేసిందట. దీంతో ఆ వార్త బాలీవుడ్ లో సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత సానియా కాస్త నోరు జారానా అని అనుకుందట. వెంటనే యూఎస్ ఓపెన్ టెన్నిస్ లో బిజీగా ఉన్న సానియా.. పరిణితికి ఓ అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడిందట. ''అనుకోకుండా అలా అనేశాను. నా బయోపి్ లో నువ్వు అయితే బాగుంటుంది. మనిద్దరి కూడా చెస్ట్ ఏరియాలో ఆశీర్వదించబడ్డాం. బాగుంటుంది. అందుకే నీ పేరు చెప్పాను అని సానియి చెప్పింది. దానితో ఇద్దరం నవ్వేశాం. ఆ తరువాత ఇండియా వచ్చాక నన్ను కలిసింది. అలా మేం ఫ్రెండ్స్ అయిపోయాం'' అని చెప్పింది పరిణీతి. ఇక వారి స్నేహబంధం రోజు రోజుకి బాగా దగ్గరైనట్లు పరిణీత వెల్లడించింది.

అయితే అప్పట్లో సానియా మీర్జా బయోపిక్ తెరకెక్కుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. కానీ ఇప్పటివరకు ఆ బయోపిక్ గురించి కరెక్ట్ న్యూస్ లేదు.