Begin typing your search above and press return to search.
సానియా కొడుక్కి పాకిస్థాన్ పౌరసత్వం లేదట
By: Tupaki Desk | 1 Nov 2018 4:08 AM GMTభారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఐతే సానియా భర్త షోయబ్ మాలిక్ పాకిస్థానీ పౌరుడైనప్పటికీ.. వీరి కొడుక్కి ఆ దేశ పౌరసత్వం లభించదట. సానియా-షోయబ్ ల కుమారుడు పుట్టింది హైదరాబాద్ లో. దీంతో అతడికి పాకిస్థాన్ తమ దేశ పౌరసత్వం ఇచ్చే అవకాశాలు లేవని అక్కడి మీడియా అంటోంది. షోయబ్ ను పెళ్లాడాక సానియాకు సైతం పాకిస్థాన్ పౌరసత్వం లభించలేదు. ఇప్పుడు ఆమె తనయుడి విషయంలోనూ ఇదే పాలసీ పాటించనుంది. పాకిస్థాన్ ద్వంద్వ పౌరసత్వాన్ని 19 దేశాలతో పంచుకుంటుండగా ఆ జాబితాలో భారత్ లేదు.
ఐతే తమ బిడ్డకు ఏ దేశ పౌరసత్వం వస్తుందన్నది పట్టించుకోవాల్సిన విషయం కాదని.. అతడి పాకిస్థానీ అనుకున్నా.. ఇండియన్ అనుకున్నా ఇబ్బందేమీ లేదని షోయబ్ అభిప్రాయపడ్డాడు. సానియా - షోయబ్ దంపతులు 2010 ఏప్రిల్ 12న పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు కొన్నేళ్ల ముందు నుంచే వీరి మధ్య ప్రేమాయణం నడిచింది. పెళ్లి తర్వాత కూడా చాలా ఏళ్లు ఆటలో కొనసాగిన సానియా.. ఈ ఏడాది రాకెట్ పక్కన పెట్టింది. గర్భం దాల్చి.. మంగళవారం బిడ్డను ప్రసవించింది. సానియా-మాలిక్ తమ కొడుకుకు ఇజాన్ అని పేరు పెట్టారు. ఇజాన్ అంటే ఉర్దూలో దేవుడిచ్చిన కానుక అని అర్థం. తమకు పుట్టబోయే బిడ్డకు మాలిక్ అనేది మాత్రమే ఇంటి పేరుగా ఉండదని - మీర్జా మాలిక్ అని ఉంటుందని సానియా గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.