Begin typing your search above and press return to search.

సానియా స్టోరీ అంటూ జోకులేల

By:  Tupaki Desk   |   10 April 2018 12:10 PM GMT
సానియా స్టోరీ అంటూ జోకులేల
X
ఇండియా పాకిస్థాన్ మధ్య ఎలాంటి ఘటనలు జరిగినప్పటికీ పాకిస్థాన్ కు ఎవరైనా మద్దతుగా మాట్లాడితే ఇండియాలో ఏ ఒక్క భారతీయుడు ఒప్పుకోడు. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలు ఇండో పాక్ నేపథ్యంలో వచ్చి జనాల్లో తెలియాకుండానే కొంత మార్పు తెస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న రాజి సినిమా ఇప్పుడు కొత్త అనుమానాలకు దారి తీస్తోంది.

ఈ సినిమాలో భారత స్త్రీ పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంటుంది. అక్కడ స్పై గా తన పనులను మొదలు పెట్టి భారత్ కు సమాచారాన్ని అందిస్తుంది. ఆలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను సేహ్మత్ నోవేల్ ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ కథ సానియా మీర్జా బయోపిక్ అంటూ ఓ ప్రముఖ వెబ్ మీడియా ట్విట్టర్ ఎకౌంట్ నుంచి వెటకారమైన ట్వీట్ వెలువడడం సంచలనంగా మారింది. అంతే కాకుండా సానియా ఆ ట్వీట్ కు రీప్లై కూడా ఇచ్చింది.

''హమ్మా.. కాదు'' అంటూ సానియా సింపుల్ గా ట్వీట్ తో కౌంటర్ ఇచ్చేసింది. సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను 2010 లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె జీవితాన్నే బేస్ చేసుకొని ఈ కథ అల్లారు అని సదరు మీడియా సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం ఇప్పుడు పలు డిస్కషన్లకు దారి తీసింది. మన దేశం అమ్మాయిని మనమే అవమానిస్తున్నాం అంటూ కొందరు కామెంట్ చేస్తే.. పాక్ జనాలు కూడా లైన్లోకి వచ్చి సానియా మా పిల్ల అంటూ రచ్చ చేస్తున్నారు. అయినా అది సానియా స్టోరీ అంటూ చెత్త జోకులు ఎందుకు బాసూ!!