Begin typing your search above and press return to search.
సానియా మీర్జా.. స్టార్ హీరోయిన్ రేంజే...
By: Tupaki Desk | 6 Feb 2016 5:30 AM GMTఇండియన్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా.. ఇప్పుడు కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉంది. విమెన్స్ డబుల్స్ - మిక్సెడ్ డబుల్స్ సత్తా చాటుతూ వరుసగా టైటిల్స్ పట్టుకొచ్చేస్తోంది. సానియా ఇంతగా బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎవరూ ఊహించలేదనే మాట వాస్తవం. అందుకే 2015కి గాను.. ఎన్డీటీవీ అందించే ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కించుకుంది సానియా మీర్జా.
ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ప్రతీ ఏటా అవార్డులిస్తుంది ఆ ఛానల్. అందులో భాగంగా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని దక్కించుకుంది సానియా. సైనానెహ్వాల్ కి కూడా ఈ అవార్డ్ వచ్చింది. అయితే ఆటతో పాటు.. అందంతోనూ, డ్రస్సింగ్ తోనూ ఆకట్టుకోవడం సానియా స్టైల్. ప్రతీ ఫంక్షన్ కి డిఫరెంట్ గెటప్ - ఫ్యాషన్ తో హాజరయ్యే సానియా.. ఇక్కడ కూడా తన ప్రత్యేకత చాటింది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఉన్న సానియా మీర్జాని చూసి అందరూ షాక్ తినేశారు కూడా.
అలాగని ఏమాత్రం ఇబ్బంది లేకుండా, అవతలి వారిని ఇబ్బంది పెట్టకుండా.. కంప్లీట్ గా టాప్ - గౌన్ ధరించిన సానియాకి బోలెడు అభినందనలు వచ్చాయి. అయితే.. అందులోనే అమ్మడి స్టైల్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఫోటోలకు పోజులు ఇస్తున్నప్పుడైతే.. స్టార్ హీరోయిన్ల ఫోటో షూట్ రేంజ్ లో అదరగొట్టేసింది సానియా మీర్జా.