Begin typing your search above and press return to search.

తల్లిదండ్రులైన సానియా-షోయబ్ మాలిక్

By:  Tupaki Desk   |   30 Oct 2018 5:16 AM GMT
తల్లిదండ్రులైన సానియా-షోయబ్ మాలిక్
X
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులకు పుత్రోత్సాహం కలిగింది. వారిద్దరికి ఈరోజు ఓ బాబు జన్మించారు. మంగళవారం ఉదయం సానియా పండండి మగబిడ్డకు జన్మనిచ్చిందని షోయబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా.. ఉద్వేగంగా ఉంది.. మగబిడ్డ.. నా శ్రీమతి ఎప్పటిలాగానే చాలా ధైర్యంగా ఉంది. మీ ప్రేమాభిమానాలు - ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ లో వ్యాఖ్యానించారు..

షోయబ్ మాలిక్-సానియా దంపతులకు మగబిడ్డ పుట్టాడని తెలియగానే వారికి ట్విట్టర్ - ఫేస్ బుక్ లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సానియా దంపతులకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ - సానియా ఫ్రెండ్ ఫరాఖాన్ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేవుడు మన బుల్లి రాకుమారుడిని దీవిస్తాడు అంటూ ట్వీట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.