Begin typing your search above and press return to search.

సానియా ప్రెగ్నెంట్ అయ్యింది!!

By:  Tupaki Desk   |   23 April 2018 5:30 PM GMT
సానియా ప్రెగ్నెంట్ అయ్యింది!!
X
సెలబ్రెటీలకు సంబందించిన ఎలాంటి విషయం బయటకి వచ్చినా వైరల్ అవ్వడం ఈ రోజుల్లో కామన్. ముఖ్యంగా వివాహానికి సంబందించిన విషయాలు లీక్ అయితే అందరి చూపు అటువైపే ఉంటుంది. గత కొంత కాలంగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వైవాహిక సంబంధం గురించి కూడా అనేక రకాల రూమర్స్ గాసిప్స్ వస్తున్నాయి. ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికీ సానియా మాత్రం కూల్ గానే స్పందించింది.

2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను సానియా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు ఎక్కువగా దుబాయ్ లో ఉంటారు. ప్రొఫెషినల్ గా బయట ప్రపంచంలో విడిగా కనిపించిన వారు ఒక్కటిగా మాత్రం ఎక్కువగా కనిపించరు. వారి మ్యారేజ్ లైఫ్ ను చాలా సీక్రెట్ గా గడుపుతుంటారు. అందువల్లనో ఏమో మరి కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇద్దరు విడిపోయారని టాక్ వచ్చింది.

వాటిని ఇద్దరు పట్టించుకోలేదు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. త్వరలోనే ఈ దంపతులు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. పిల్లల్ని కనడానికి ఇదే మంచి సమయమని సానియా దంపతులు డిసైడ్ అయ్యారు. ఇక పుట్టబోయే బిడ్డకు ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా మీర్జా మాలిక్ అని నామకరణం చేయనున్నారు. అప్పుడే వారికి బిడ్డ గురించి ప్లాన్ వేసుకుంటున్న ఈ క్రీడా దంపతులు చాలా సంతోషపడుతున్నారట. మరి పుట్టబోయో బిడ్డ ఏ బ్యాట్ ( టెన్నిస్ - క్రికెట్) పట్టుకుంటాడో చూడాలి!!