Begin typing your search above and press return to search.
అసలువన్నీ దాచేసి ఆటోబయోగ్రఫీనా.. హౌ?
By: Tupaki Desk | 19 July 2016 5:19 AM GMTటెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ మధ్య తన ఆటోబయోగ్రఫీని విడుదల చేసింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా 'ఏస్ ఎగైనెస్ట్ ఆడ్స్' (Ace Against Odds) అనే టైటిల్ పై రాసిన ఈ బుక్ లాంఛింగ్ కార్యక్రమాన్ని కూడా చేసింది. ఈ బుక్ లో చాలానే సంగతులు రాసినట్లు కూడా చెప్పింది. పనిలో పనిగా తన పెళ్లి సంగతులు కూడా ఉంటాయనే విషయం కూడా చెప్పింది.
నిజానికి సానియా మీర్జా ఆటోబయోగ్రాఫీ బుక్ లో.. పెళ్ళి గురించి పెద్దగా డీటైల్స్ ఏవీ కనిపించలేదు. షోయెబ్ మాలిక్ కి అప్పటికే పెళ్ళయినా.. ఆ డీటైల్స్ గురించి కూడా ఏమీ ప్రస్తావించలేదు. ఓ చోట ఎక్కడో అతనికి పెళ్లి అయ్యింది అంతే అన్నట్లుగా ఓ మాట టచ్ చేసింది. కాకపోతే.. ఇండియాలో పెళ్ళి.. పాకిస్తాన్ లో రిసెప్షన్ ఫోటోలను మాత్రం ఆ బుక్ లో పబ్లిష్ చేసింది. ఇంతకు మించి చెప్పాల్సిన విషయం ఏంటంటే.. పర్సనల్ విషయాలను కూడా చాలానే దాచిపెట్టేసింది.
సానియా మీర్జాకు మొదటవేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అవ్వడం.. దానికకంటే ముందు ఒక చిన్న లవ్ స్టోరీ.. ఇలాంటివేవీ కూడా ఆ బుక్ లో ప్రస్తావనకు రాలేదు. అసలు విషయాలు దాస్తే అది ఆటోబయోగ్రాఫీ ఎలా అవుతుందో సానియా మీర్జాకే తెలియాలి. ఈ బుక్ ని ఆటో బయోగ్రఫీ అనేకంటే.. సానియా కెరీర్ గ్రోత్ గురించిన బుక్ అంటే సరిపోతుందనే టాక్ గట్టిగానే ఉంది. అయినా.. 29 ఏళ్లకే ఆటోబయోగ్రఫీ అంటే.. ఇలాగే అన్నీ దాచుకోవాల్సి వస్తోంది. అందరూ ఇలాంటి సమస్యలేవీ రావనే.. 60దాటాక రాసుకుంటూ ఉంటారు.