Begin typing your search above and press return to search.

బొట్టు పెట్టుకోనంటే..సినిమాల్లో కుదురుతుందా?

By:  Tupaki Desk   |   5 Aug 2015 2:05 PM GMT
బొట్టు పెట్టుకోనంటే..సినిమాల్లో కుదురుతుందా?
X
కాంజీపురం పట్టు చీరలో తళుక్కుమని కుర్రాళ్ల గుండెల్ని గుభేల్‌ మనిపించింది హైదరాబాదీ సోయగం సానియా మీర్జా. ఇటీవలే ముంబై జువెలరీ ఫ్యాషన్‌ వీక్‌ లో బంగారు వజ్రాభరణాల్ని ధరించి కాంజీపురం వరమహాలక్ష్మి కంచిపట్టు చీరలో హొయలొలికించింది. ర్యాంపు ని గజగజలాడించింది అమ్మడు. అప్పుడే అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ నుంచి ఫిలింమేకర్స్‌ కూడా ఒణికిపోయారు.

ఇంతటి అందాన్ని ఇలలో నైనా చూడలేదే.. అంటూ కూనిరాగాలు తీశారు. అసలు సానియా ఊ అనాలే కానీ వెంటనే సినిమా తీసేయాల్సిందేనని ఎంతోమంది ఉద్వేగానికి గురయ్యారు. నిజానికి కంచిపట్టు చీరలో సానియా దేవకన్యని తలపించింది. దేవేంద్రి కలెక్షన్స్‌ లో నిజంగానే వరలక్ష్మి ని తలపించింది. అయితే ఈ అమ్మడిలో ఒకే ఒక్క లోపం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించింది. చీరలో అంత సింగారించినా ఆ నుదిటిన బొట్టు కనిపించకపోయేసరికి చాలా మంది నిరాశ పడ్డారు.

ఆ బొట్టులోనూ ఎంత ముద్దొచ్చేస్తుందో చూడాలని తహతహలాడారు. అయితే ఇదే ప్రశ్న సానియాని అడిగితే ససేమిరా అని మారాం చేసిందిట. ఎప్పటికీ 'బొట్టు' అనేదే పెట్టుకోనని మొహం తిప్పేసిందిట. మతవిశ్వాసాలకు విరుద్దమయిన పనులు చేయని ఇన్‌ డైరక్టు గా సంకేతం ఇచ్చింది. ఇలా అయితే ఎలాగమ్మా? సినిమాల్లోకొస్తే ఆ కట్టుబాట్లు కుదరవు. బొట్టు పెట్టుకోవాల్సిన సందర్భం తప్పనిసరి. ఇలాగైతే ఎలా మరి?