Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సానియా అండ్ పాక్ గ్యాంగ్

By:  Tupaki Desk   |   19 July 2017 4:46 AM GMT
ఫోటో స్టోరి: సానియా అండ్ పాక్ గ్యాంగ్
X
ఒక వైపు యుద్ధ వాతావరణం.. మరోవైపు ఆటల్లో విపరీతమైన పోటీ.. ఇది ఇండియా - పాక్ ల మధ్య కనిపించే పరిస్థితులు. కానీ భారత్- పాకిస్తాన్ ల మధ్య మరో కోణం కూడా ఉంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించడం భారత్ - పాక్ జనాల స్పెషాలిటీ.

రీసెంట్ గా ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోస్ట్ చేసిన ఫోటో చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. క్రికెట్ మ్యాచ్ కానీ.. మరే ఇతర క్రీడా పోటీ కానీ జరిగినప్పుడు ఎంతగా ఒకరితో ఒకరు తలపడతారో చాలాసార్లు చూసే ఉంటాం. కానీ ఆయా ఆటలు ముగిసిపోయాక.. ఎంతో స్నేహంగా మెలగుతారు వీరంతా. తాజాగా ఇండియా-పాకిస్తాన్ లకు చెందిన పలువురు సెలబ్రిటీలు కలిసి ఎంజాయ్ చేసిన ఓ సంఘటనకు చెందిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సానియా. ఇందులో సానియా భర్త.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఉండడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. అయితే.. ఆ పక్కనే ఇండియన్ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్.. అతని భార్య బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన సాగరికా ఘట్గేలు కూడా ఉన్నారు. అంతే కాదు.. ఈ ఫోటోలో ఆశిష్ నెహ్రాతో పాటు అజార్ మెహమూద్.. అతని భార్య ఎబ్బా ఖురేషీ.. బాలీవుడ్ యాక్టర్ హర్మాన్ బవేజాలు కూడా కనిపిస్తారు.

ఇండియా- పాకిస్తాన్ సెలబ్రిటీల మధ్య ఇంతటి స్నేహం ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు కదా. మొత్తానికి ఇలా సానియా అండ్ పాక్ గ్యాంగ్ అందరూ కలసి ఫోటోలు దిగడానికి.. ఆల్రెడీ పాక్ క్రికెటెర్ ను పెళ్ళి చేసుకున్న మన టెన్నిస్ సెన్సేషన్ ఇలా రూటు క్రియేట్ చేసిందట. అది సంగతి.