Begin typing your search above and press return to search.

పవన్ ఉండగా.. పాపలెందుకు దండగ!!

By:  Tupaki Desk   |   23 Nov 2015 11:00 PM IST
పవన్ ఉండగా.. పాపలెందుకు దండగ!!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలంటే వాటిలో కాస్త తిక్క ఉంటుంది కానీ.. ఓ లెక్క ప్రకారం కూడా ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో చాలా ఎలర్ట్ గా ఉంటాడు పవన్. పాటల కోసం వచ్చి పోయే హీరోయిన్స్ పవర్ స్టార్ మూవీస్ లో ఉండరు. వాళ్లకో కేరక్టర్ ఉంటుంది. ఆ కేరక్టర్ కి ఓ డిగ్నిటి ఉంటుంది. అన్నిటికీ మించి, హీరోయిన్స్ విషయంలో ఓ లిమిట్ ఉంటుంది.

ఇప్పటివరకూ పవన్ ఒకే ఒక సినిమా తీన్ మార్ మూవీలో హీరోయిన్ కి ముద్దులిచ్చాడంతే. అలాగే ఇప్పటివరకూ పవన్ ఏ సినిమాలోనూ ముగ్గురు హీరోయిన్స్ లేరు. అత్తారింటికి దారేది లో పార్టీ సాంగ్ దీనికి మినహాయింపు లెండి. కాకపోతే అది వేరే థీమ్. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ కి లెక్కలు మారుతున్నాయి. అసలు ఒక హీరోయిన్ సెలక్షన్ నే నెలలపాటు నాన్చిన సర్దార్.. ఇప్పటికి ముగ్గురికి లెక్కలు చెప్పాడు. ఒకవైపు కాజల్ మెయిన్ హీరోయిన్ ఉండగా.. లక్ష్మీరాయ్ ని ఐటెం బాంబ్ అన్నారు. ఇప్పుడు సంజన కూడా కౌంటింగ్ లోకి వచ్చింది. ఇంకా ఎంతమంది వస్తారో చెప్పలేం కానీ.. పవర్ స్టార్ అయితే ముగ్గురు హీరోయిన్స్ తో సందడి చేయడం మాత్రం ఖాయమైంది. అయినా.. పవన్ కళ్యాణ్ ఉండగా.. అసలింత మంది హీరోయిన్స్ అవసరమా అనిపించడం సహజం. ఎందుకంటే అసలు పవర్ స్టార్ సినిమాని.. హీరోయిన్ కోసం చూడ్డానికి వచ్చాం అనే వాళ్లని ఒక్కళ్లనైనా చూపించండి చూద్దాం.

కాకపోతే సినిమా స్కేల్‌ అండ్‌ రేంజ్‌ ను కొత్త లెవెల్‌ కు తీసుకెళ్లడానికి ఇలా చాలామంది హీరోయిన్లకు ఛాన్సిస్తున్నాడట పవన్‌ కళ్యాణ్‌. క్యాస్టింగ్‌ ఆ లెవెల్‌ లో ఉంటే.. ఆటోమ్యాటిక్‌ గా రీచ్‌ ఇంకా తారాస్థాయికి చేరుతుందని మార్కెటింగ్‌ ఎకనామిక్స్‌ కోసం ఇలా ఇందరు భామలను తీసుకుంటున్నట్లు చెబుతున్నారు ఫిలిం నగర్‌ లో. ఏమీ రీచ్చో తెలియదు కాని.. ఫ్లాపు భామలందరికీ బాబు బ్రేకిస్తున్నట్లుందీ యవ్వారం.