Begin typing your search above and press return to search.

డ్రగ్స్ దందాలో పేరు.. ఖండించిన హీరోయిన్

By:  Tupaki Desk   |   4 Sept 2020 11:01 PM IST
డ్రగ్స్ దందాలో పేరు.. ఖండించిన హీరోయిన్
X
కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ మూలాలు బయటపడడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ దందాలో చాలా మంది సినీ ప్రముఖల పేర్లు బయటపడుతున్నాయి. తెలుగుతోపాటు కన్నడలో నటించి పాపులరైన హీరోయిన్ సంజనా పేరు ఇప్పుడు ఈ డ్రగ్స్ దందాలో వినపడుతోంది. ఈ వార్తలతో సంజన కలత చెందుతోంది.

సంజన గార్లాని తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో పలుచిత్రాల్లో నటించి హీరోయిన్ గా గుర్తింపు పొంది. ఆమెకు కన్నడ నాట మంచి అభిమానులను కలిగి ఉంది. అయితే తాజాగా ఆమె పేరు బయటపడడంతో అందరి దృష్టిలో సంజన పేరు మారుమోగుతోంది.

సంజన స్నేహితులలో ఒకరైన రాహుల్‌ను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. మీడియా ఆమె పేరును కూడా హైలైట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఆమెను కూడా ప్రశ్నించడానికి పిలుస్తారు లేదా అరెస్టు చేయవచ్చని కన్నడనాట ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం సంజన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుందన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఆమె ప్రమేయంపై రకరకాల వార్తలు వస్తున్నాయి.

ఏ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యక్తులతో లేదా ముఠాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరోయిన్ సంజన చెబుతోంది. తన పేరును ఈ డ్రగ్స్ దందాలో అనవసరంగా తీసుకురావద్దని కన్నడ మీడియాకు ఆమె విజ్ఞప్తి చేస్తోంది.