Begin typing your search above and press return to search.

బేబీ బంప్‌ తో హీరోయిన్‌ సందడి

By:  Tupaki Desk   |   24 Feb 2022 7:29 AM GMT
బేబీ బంప్‌ తో హీరోయిన్‌ సందడి
X
ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయం అయిన ముద్దుగుమ్మ సంజన. తెలుగు.. కన్నడంతో పాటు తెలుగు లో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు సుదీర్ఘ కాలం పాటు కెరీర్‌ లో కొనసాగింది. టాలీవుడ్‌ లో హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాబట్టుకోలేక పోయింది. కాని ఈమె కు హీరోయిన్ గా ఇతర భాషల్లో మాత్రం బాగానే ఆఫర్లు వచ్చాయి.

ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ అయ్యి కొన్నాళ్లు జైల్లో కూడా ఉన్న సంజన ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించిన విచారణ ఎదుర్కొంటుంది. ఈ సమయంలోనే సంజన పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా సాగుతుందంటూ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది. ఇటీవల మాత్రం భర్త నుండి సంజన దూరంగా ఉంటుందనే పుకార్లు మొదలు అయ్యాయి. ఆ సమయంలోనే తాను గర్బవతిని అంటూ అధికారికంగా ప్రకటించింది.

సంజన గర్లానీ గర్బవతి అంటూ అధికారిక ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఆమె సన్నిహితులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవలే తన ప్రెగ్నెన్సీ విషయాలను మరియు అనుభవాలను షేర్‌ చేసుకున్న ఈ అమ్మడు తాజాగా మరో వీడియోను ఇన్‌ స్టా గ్రామ్‌ లో షేర్ చేసి ఫాలోవర్స్ కు తన బేబీ బంప్ ను మొదటి సారి చూపించింది.

తన యోగా టీచర్ తో కలిసి ఈ వీడియో లో సంజన సందడి చేసింది. ఈ మద్య కాలంలో గర్బంతో ఉన్న వారు ఎక్కువగా యోగా చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో యోగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఈ సందర్బంగా సంజనా అవగాహణ కల్పించే ప్రయత్నం కూడా చేసింది. ఈ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఆమె సలహాలు ఇస్తూ వస్తుంది.

ఇక సంజన సినీ కెరీర్‌ విషయానికి వస్తే తెలుగు లో 2 కంట్రీస్ తర్వాత మళ్లీ నటించలేదు. కన్నడం మరియు మలయాళంలో మాత్రం నటించింది. ఈ ఏడాదిలో కూడా ఈమె నటించిన తమిళ సినిమా ఒకటి విడుదలకు సిద్దంగా ఉంది. మలయాళం మరియు కన్నడంలో మంచి ఆఫర్లు వస్తున్న సమయంలోనే డ్రగ్స్ కేసు వల్ల జైలుకు వెళ్లడం.. ఆ వెంటనే పెళ్లి చేసుకోవడం.. ఇప్పుడు ప్రెగ్నెన్సి. దాంతో సినిమాలకు కాస్త దూరంగానే ఈమె ఉంటుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈమె సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.