Begin typing your search above and press return to search.

పవన్ కు ప్రభాస్ భామ సపోర్ట్

By:  Tupaki Desk   |   9 Jan 2018 4:22 AM GMT
పవన్ కు ప్రభాస్ భామ సపోర్ట్
X
ప్రస్తుతం టాలీవుడ్ చాలా హాట్ హాట్ గా నడుస్తున్న వివాదం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ కత్తి మహేష్ ల ఇష్యూయే. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ట్వీట్లతో నడిచిన వివాదం తాజాగా సవాలంటూ రోడ్డెక్కేదాకా వచ్చింది. చివరకు టీవీ ఛానళ్లంతా ఇతర పనులు మానేసి మరీ ఇదే విషయంపై మాగ్జిమం ఫోకస్ చేశాయి.

ఈ వివాదానికి సంబంధించి పవన్ ఇంతవరకు బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. అయితే అతడికి ఇండస్ట్రీలో ఉన్నవారి నుంచి సపోర్ట్ కూడా కాస్త తక్కువగానే ఉంది. ఈమధ్యనే రైటర్ కోన వెంకట్.. నటి పూనమ్ కౌర్ లు పవన్ కు మద్దతుగా మాట్లాడారు. తరవాత పూనమ్ వివాదంలో చిక్కుకుని కేంద్ర బిందువైంది. తాజాగా పవన్ కు మద్దతుగా మరో భామ నోరిప్పింది. ఆమె బుజ్జిగాడు సినిమాతో ఫేమస్ అయిన సంజన. ‘‘కొంతమంది వ్యక్తులకు కష్టపడి పనిచేసి పేరు తెచ్చుకోలేక పేరు ప్రఖ్యాతులున్న వారిని.. విజేతలుగా నిలిచిన వారిపై రాళ్లేయడం ద్వారా పాపులరవదామని చూస్తారు. మేమంతా మీతో ఉన్నాం’’’ అంటూ పవన్ పేరు ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సంజన ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆమె పవన్ హీరోయిన్ గా కాకుండా విలన్ శరద్ కేల్కర్ భార్యగా కనిపిస్తుంది. తరవాత తెలుగులో పెద్దగా అవకాశాలేవీ రాకపోవడంతో శాండల్ వుడ్ కు మకాం మార్చేసింది. మరోసారి తన లేటెస్ట్ ట్వీట్ ద్వారా మొత్తం టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.