Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో కి అస్సలు ఏమయ్యింది ?

By:  Tupaki Desk   |   10 Aug 2020 5:32 AM GMT
ఆ స్టార్ హీరో కి అస్సలు ఏమయ్యింది ?
X
బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన లంగ్స్‌ ఇన్ఫెక్షన్‌ తో ఇబ్బంది పడుతున్నట్లుగా వైధ్యులు చెబుతున్నారు. ఇటీవలే ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ వచ్చింది. కనుక టెన్షన్‌ లేదని అనుకున్నారు. ఈ సమయంలోనే ఆయన శ్వాసకు సంబంధించి మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముంయిలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన్ను ఉంచి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.

సంజయ్‌ దత్‌ స్నేహితుడు చెప్పినదాని ప్రకారం వైధ్యులు అతడి లంగ్స్‌ నుండి వాటర్‌ ను తొలగించారు. ప్రస్తుతం దత్‌ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే ఆయన ఆరోగ్యం మెరుగు పడుతుందని వైధ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం సంజయ్‌ దత్‌ భార్య మరియు పిల్లలు దుబాయిలో ఉన్నారు. కరోనా కారణంగా ముంబయికి వారు రావడానికి సాధ్యం కావడం లేదు. గత మార్చి నుండి వారు అక్కడే ఉన్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత సంజయ్‌ దత్‌ పరిస్థితి నేపథ్యంలో వారు ఇండియాకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ప్రస్తుతం సంజయ్‌ దత్‌ కేజీఎఫ్‌ 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల ఆయన బర్త్‌ డే సందర్బంగా ఫ్యాన్స్‌ భారీ ఎత్తున వేడుకలు చేశారు. అలాగే కేజీఎఫ్‌ 2 సినిమాలోని ఆయన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. అత్యంత భయంకరమైన పాత్రలో సంజయ్‌ దత్‌ కనిపించబోతున్నట్లుగా ఆ ఫస్ట్‌ లుక్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది. సంజత్‌ దత్‌ త్వరగా కోలుకుని షూటింగ్స్‌ కు హాజరు అవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.