Begin typing your search above and press return to search.

'KGF 2' పై సంజూ భాయ్ షాకింగ్ కామెంట్స్..!

By:  Tupaki Desk   |   20 April 2022 3:30 AM GMT
KGF 2 పై సంజూ భాయ్ షాకింగ్ కామెంట్స్..!
X
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ సినిమా 'కేజీయఫ్: చాప్టర్ 2' ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇందులో ప్రతినాయకుడు అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓ అభిమానికి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. "ప్రతి ఒక్కరూ 'KGF 2' చిత్రాన్ని నాలుగైదు సార్లు చూడాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీకు మొదటిసారి ఈ సినిమా అర్థం కాదు" అని సంజయ్ దత్ పేర్కొన్నారు. ఈ స్టేట్మెంట్ ని పాజిటివ్ లేదా నెగటివ్ గా ఏ విధంగానైనా అర్థం చేసుకోవచ్చు.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఉద్దేశ్యంతో 'కేజీయఫ్ 2' సినిమాను మళ్లీ మళ్లీ చూడమని.. అప్పుడు సరైన అనుభూతిని పొందుతారని పాజిటివ్ గా ఆలోచించవచ్చు. అదే సమయంలో ఈ సినిమా ఆడియన్స్ కు అర్థంకాని విధంగా ఉందని నెగెటివ్ టెన్స్ లో అనుకోవచ్చు.

సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు కాబట్టి.. అతని ఈ వ్యాఖ్యలు పాజిటివ్ గానే అనుంటారని భావించవచ్చు. నిజానికి 'కేజీఎఫ్ 2' చిత్రానికి ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా యావరేజ్ గానే వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు కావడం విశేషం.

ఇకపోతే 'కేజీయఫ్ 2' సినిమాకు ముందు సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే మహమ్మారి వ్యాధిపై అలుపెరగని పోరాటం చేసి జయించారు. ఆ తర్వాత ఆయన నటించిన తొలి సినిమా ఇదే. ఎండా వానా.. పగలు రాత్రీ లెక్క చేయకుండా సీనియర్ షూటింగ్ లో పాల్గొని చిత్ర బృందాన్ని ఆశ్చర్యానికి గురిచేశారని తెలుస్తోంది.

సంజయ్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ పై చిత్రీకరించాలని ప్లాన్ చేసారట. అయినా వినకుండా తొలి రోజు సెట్స్ లో అడుగుపెట్టి పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాల్లో సహజంగానే నటించారట. దాని ఫలితమే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తోంది.

'కేజీయఫ్ 2' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సంజయ్ దత్.. ప్రస్తుతం 'ది గుడ్ మహారాజా' 'తులసీదాస్ జూనియర్' 'ఘడ్ చది' వంటి హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సంజూ నటించిన 'పృథ్వీరాజ్' 'షంషేరా' వంటి సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాయి.