Begin typing your search above and press return to search.
జైల్లోంచి రాగానే సంజయ్ ఏం చేస్తాడు?
By: Tupaki Desk | 31 Jan 2016 1:30 AM GMTఐదేళ్ల జైలు శిక్ష అంటే మాటలు కాదు. బయట రాజభోగాలు అనుభవించే తమ హీరో సంజయ్ దత్ జైల్లో అంతకాలం ఎలా గడుపుతాడో అని అతడి అభిమానులు చాలా వర్రీ అయిపోయారు. బాలీవుడ్లో అతణ్ని నమ్ముకున్నవాళ్లు విలవిలలాడిపోయారు. అరడజను ప్రాజెక్టుల దాకా ఆగిపోయాయి. మొత్తానికి అప్పటికే అనుభవించిన శిక్షను మైనస్ చేసి.. సత్ప్రవర్తన కారణంగా ఇంకో ఆరు నెలలు శిక్ష తగ్గించేస్తే దాదాపు మూడేళ్లు జైల్లో గడిపాడు సంజు. ఇంకో నెల రోజుల్లోపే అతను బయటి ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. ఫిబ్రవరి 25న విడుదల కాబోతున్న 46 ఏళ్ల సంజూ కోసం బాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ఇక సంజూ పునరాగమనం ఎలా ఉంటుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది. సంజూ ఓకే అనాలే కానీ.. అతడితో సినిమాలు చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఐతే అతను మాత్రం సొంత బేనర్లో సినిమాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సొంతంగా బేనర్ పెట్టి అందులో తనే హీరోగా సినిమాలు తీయడమే కాక.. బయటి హీరోలకూ ఛాన్సులివ్వాలనుకుంటున్నాడు. ముందుగా మున్నాభాయ్ సిరీస్ లో భాగంగా తన మిత్రుడు రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో మూడో సినిమాను అందించాలని ప్రణాళికలు రచించుకున్నాడట సంజయ్. దీంతో పాటు జైల్లో తనతో పాటు సెల్ పంచుకున్న వ్యక్తి జీవిత గాథను కూడా సినిమాగా తీయడానికి పూనుకోబోతున్నాడు. జైల్లో అతడి కథ విని కరిగిపోయిన సంజూ.. దాన్ని తెరమీదకి తేవాలనుకుంటున్నాడు. తనకు తెలిసిన విషయాలన్నీ రచయితలకు చెప్పి మంచి కథ రెడీ చేయించి సినిమాగా తీయాలనుకుంటున్నాడట. మొత్తానికి జైలు జీవితం సంజూకి ఈరకంగా పనికొస్తోందన్నమాట.