Begin typing your search above and press return to search.

సంజు మహా డేరింగ్ గురూ!!

By:  Tupaki Desk   |   31 May 2018 5:30 PM GMT
సంజు మహా డేరింగ్ గురూ!!
X
బయోపిక్ లకు అర్ధాలు మారిపోతున్నాయి. ఓ వ్యక్తి జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చూపించేస్తే.. బయోపిక్ అనుకునేవాళ్లం. కానీ ఆ వ్యక్తికి సంబంధించిన కష్టనష్టాలను.. మంచి చెడులను అన్నిటినీ ఆమూలాగ్రం చూపించాలంటే.. అందుకు ఆయా వ్యక్తులే ఒప్పుకోరు. అయినా.. ఏ హీరో త‌న డ్ర‌గ్ అల‌వాట్ల గురించి, విచ్చ‌ల విడిగా చేసిన శృంగారం గురించీ, జైలు గోడ‌ల మ‌ధ్య అనుభ‌వించిన న‌ర‌కం గురించి చెప్పుకుంటాడు? చెప్పండి..

కానీ సంజ‌య్ ద‌త్ మాత్రం అన్నీ చెప్పుకున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ రూపొందించిన సంజు ట్రైలర్ చూస్తే ఎవరైనా అవాక్కవాల్సిందే. అంతగా సంజయ్ దత్ జీవితంలోని డెప్త్ ను చూపించారు. ఎప్పుడు డ్రగ్స్ వాడాల్సి వచ్చింది.. ఎలా బానిస అయ్యాడు.. ఎంతమంది అమ్మాయిలతో శృంగార సంబంధాలు ఉన్నాయి.. ఎంతమంది వేశ్యలతో సెక్స్ చేశాడు.. పోలీసులు ఎలా కొట్టారు లాంటి వివరాలు చూపించారు. అంతే కాదు.. జైలు గదిలో ఉండగా ఎలాంటి నరకం చూశాడో చూపించిన విధానం అయితే.. కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది.

తన జీవితంలో మంచి గురించి అందరూ చెప్పుకుంటారు. కానీ సంజయ్ దత్ మాత్రం.. తన కష్టాలను.. తనలోని చెడును కూడా చెప్పేందుకు సాహసించాడు. రియల్ లైఫ్ లో హీరో-విలన్.. ఏ పాత్ర ఇవ్వాలో చెప్పలేం కానీ.. ఇలాంటి డేరింగ్ విషయంలో మాత్రం సంజయ్ దత్ ను రియల్ హీరో అనాల్సిందే.