Begin typing your search above and press return to search.

ఇంత సెక్సీగానా? కాళ్ళు విరగ్గొట్టేస్తాడేమో

By:  Tupaki Desk   |   22 Oct 2017 5:15 AM GMT
ఇంత సెక్సీగానా? కాళ్ళు విరగ్గొట్టేస్తాడేమో
X
'కూతురు సినిమాల్లోకి వస్తే కాళ్లు విరగ్గొడతా!!' అంటూ ఈ మధ్యకాలంలో చెబుతున్న స్టార్ తండ్రి ఎవరైనా ఉన్నారంటే.. అది ఖచ్చతంగా సంజయ్ దత్ సారే. మనోడు సినిమాల్లో ఇప్పటికీ రొమాన్సులూ గట్రా చేస్తున్నాడు కాని.. తన మొదటి భార్య కూతురుపై మాత్రం చాలా ఆంక్షలే పెడుతున్నాడు.

ఇప్పటికే కూతురు త్రిషాలా దత్ సినిమాల్లోకి రావడం తనకు ఇష్టంలేదని పబ్లిక్ గా చెప్పేసిన దత్.. అసలు ఆమె మనస్సులో ఏముందో మాత్రం అడిగి ఉండడు. ప్రస్తుతం త్రిషాలా న్యూయార్క్ నగరంలో చదువుకుంటోంది. ఫ్యూచర్ లో సైకాలజిస్ట్ అవుతాను అంటూ చెబుతున్నా కూడా.. ఎప్పటికప్పుడు ఆమె తన హాట్ ఫోటోలను పోస్టు చేస్తుంటే మాత్రం నెటిజన్లకు జ్వరం వస్తోందనే చెప్పాలి. అయితే ఇంత సెక్సీగా ఉండడం అనేది త్రిషాలకు న్యాచురల్ గా వచ్చిన అలవాటా లేకపోతే సినిమాల్లోకి రావాలనే ఇలానే చేస్తోందా? అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు.

అసలు సంజయ్ దత్ ఒప్పుకోకపోయినా కూడా.. ఇలా తను వరుసగా ఫోటోలు పెట్టేసుకుంటూ పోతే.. కరణ్‌ జోహార్ వంటి పెద్దలు ఆ ఫోటోలను చూసి వాళ్ళ నాన్నను కన్విన్స్ చేస్తారని ఆమె ఆశ కాబోలు. గతంలో సైఫ్‌ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ కూడా ఇలాగే చేసింది.