Begin typing your search above and press return to search.

అప్పటి బానిసే ఇప్పుడు అంబాసిడర్

By:  Tupaki Desk   |   17 May 2017 11:33 AM GMT
అప్పటి బానిసే ఇప్పుడు అంబాసిడర్
X
మున్నాభాయ్ అని బాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే సంజయ్ దత్ జీవితంలో ఎన్నెన్నో మలుపులు ఉంటాయి. అందరికీ తెలిసిన జైలు జీవితం ఓ లెక్క అయితే.. అంతకు ముందే.. అంటే తన ఇరవైలలోనే డ్రగ్స్ కు బానిస అయ్యాడు సంజయ్ దత్.

డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడేందుకు అప్పట్లో స్పెషల్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాతే కెరీర్ లో అడుగులు వేయగలిగాడు సంజయ్ దత్. ఇప్పుడు దేశవ్యాప్తంగా డ్రగ్స్ బాధితుల కోసం డీ అడిక్షన్ సెంటర్లు ప్రారంభించాలని సంజయ్ దత్ భావిస్తున్నాడు. డ్రగ్స్ మత్తు నుంచి ప్రజలను బయటకు రావాలంటూ తనే ప్రచారం చేయనున్నాడు కూడా. ఇలా డీ అడిక్షన్ సెంటర్స్ ను ప్రారంభించేందుకు అవసరమైన సెంటర్స్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వాన్ని అనుమతులకు దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పర్మిషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నాడట.

ఇలా డీ అడిక్షన్ సెంటర్స్ ను ప్రారంభించేందుకు తగిన కారణమే సంజయ్ దత్ దగ్గర ఉంది. నిజానికి ఇది చాలా ఖరీదైన వ్యవహారం. తన తల్లిదండ్రులు శ్రీమంతులు కావడంతో తనకు ట్రీట్మెంట్ ఇప్పించారని.. సామాన్యులకు కూడా ఇది అందుబాటులోకి తెచ్చేందుకు అతి తక్కువ రుసుముతో ఈ సెంటర్స్ ను నిర్వహించాలన్నది సంజయ్ దత్ ఆలోచన.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/