Begin typing your search above and press return to search.
సంజయ్ దత్ కి నాలుగో దశ ఊపిరితిత్తుల క్యాన్సర్
By: Tupaki Desk | 12 Aug 2020 4:00 AM GMTబాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నాలుగవ దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నారని ముంబై లీలావతి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తుల సమస్యతో శనివారం ఆసుపత్రికి తరలించిన అనంతరం వైద్యులు చికిత్స చేసి సోమవారం నాడు డిశ్చార్జ్ చేశారు.
దత్ ఆస్పత్రిలో ప్రవేశించేప్పటికి ఆక్సిజన్ స్థాయి 90-92% మధ్య హెచ్చుతగ్గులకు గురైంది. దాంతో త్వరిత గతిన యాంటిజెన్ కిట్ ద్వారా కోవిడ్ -19 ను పరీక్షించారు. అయితే అతడికి నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. అటుపై సంజయ్ దత్ ఛాతీలో ద్రవం అభివృద్ధి చెందిన విషయాన్ని గమనించిన డాక్టర్లు .. అనంతర టెస్టుల్లో నాలుగవ దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.
కోవిడ్ ప్రతికూల ఫలితం రావడంతో సందేహించిన డాక్టర్లు క్యాన్సర్ టెస్టులు నిర్వహించారు. సంజయ్ దత్ కి చికిత్సను అందిస్తున్న వైద్యుడు డాక్టర్ జలీల్ పార్కర్ ను ఇదే విషయమై సంప్రదిస్తే.. రోగి గోప్యతను దృష్టిలో పెట్టుకుని దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయడానికి ఇష్టపడడం లేదని తెలిపారు. అయితే సంజయ్ దత్ కి క్యాన్సర్ అని తెలియగానే అభిమానుల్లో కంగారు మొదలైంది. దీనికి వెంటనే స్పందించిన దత్ తాను కోలుకుంటానని ఎవరూ చింతించవద్దని కోరారు. క్యాన్సర్ కి వైద్య చికిత్స కోసం కొంత విరామం తీసుకుంటున్నానని ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక కేజీఎఫ్ - చాప్టర్ 2లో సంజయ్ దత్ క్రూరుడైన విలన్ అధీర పాత్రలో నటిస్తున్నారు.