Begin typing your search above and press return to search.
సినిమా డిజాస్టర్.. ప్రేక్షకులపై ఆగ్రహం
By: Tupaki Desk | 29 July 2022 6:33 AM GMTబాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన రణబీర్ కపూర్ హీరో.. వాణి కపూర్, సంజయ్ దత్ సహా భారీ తారాగణం... అగ్నిపథ్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్... యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ.. రూ.150 కోట్ల భారీ బడ్జెట్.. ఇలా ఎన్నో ఆకర్షణలున్న సినిమా.. షంషేరా. కానీ ఏం ఫలితం? పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.50 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోతోంది. వారం తిరక్కముందే సినిమా థియేట్రికల్ రన్ ముగిసిపోయే పరిస్థితి నెలకొంది. ఇక సినిమా పుంజుకుంటుందన్న ఆశలేమీ కనిపించడం లేదు. సినిమా రిజల్ట్ ఏంటో తేలిపోయిన నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సంజయ్ దత్ మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేశాడు.
తాము ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చు పెట్టి తీసిన సినిమాకు ఇలాంటి ఫలితం రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూనే పరోక్షంగా షంషేరాను ఆదరించని ప్రేక్షకుల విషయంలో అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు సంజయ్ దత్.
సినిమా ఉన్నదాని కంటే నెగెటివిటీ చాలా ఎక్కువగా కనిపించిందని.. అదే పనిగా తమ చిత్రాన్ని అందరూ తెగనాడారన్న విధంగా సంజయ్ వ్యాఖ్యానించాడు. సినిమా చూడని వాళ్లు కూడా దీని మీద విమర్శలు గుప్పించారని, ఇది ఎప్పుడూ చూడని పరిణామమని సంజయ్ దత్ అన్నాడు.
ఎవరేమన్నా సరే.. తాను దర్శకుడు కరణ్ మల్హోత్రాకు అండగా నిలుస్తానని.. అతను గొప్ప దర్శకుడని.. షంషేరా విషయంలో అతను పడ్డ కష్టమంతా తనకు తెలుసని సంజయ్ పేర్కొన్నాడు. రణబీర్ కపూర్ మీద కూడా అతను ప్రశంసలు కురిపించాడు. షంషేరా సినిమా చేరాల్సిన సమయంలో ప్రేక్షకులకు చేరుతుందని, ముందో వెనుకో అందరూ ఈ సినిమా చూస్తారని సంజయ్ దత్ అన్నాడు. ఐతే సినిమా బాలేని విషయం అంగీకరించకుండా ప్రేక్షకులను పరోక్షంగా సంజు విమర్శించడాన్ని చాలామంది తప్పుబట్టడుతున్నారు