Begin typing your search above and press return to search.
KGF2: అధీరా ఎవరో కనిపెట్టేశాం!
By: Tupaki Desk | 27 July 2019 6:45 AM GMTకేజీఎఫ్ -చాప్టర్ 1 అభిమానులు సీక్వెల్ రాకకోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. అవతార్ అభిమానులు సీక్వెల్ కోసం వేచి చూస్తున్నంత కసి కేజీఎఫ్ అభిమానుల్లో కనిపిస్తోంది. అంతేకాదు కేజీఎఫ్ చాప్టర్ 2 ని మరో లెవల్లో ఊహిస్తున్నారు. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్- హోంబలే ఫిలింస్ పై తీవ్ర ఒత్తిడి నెలకొందని తెలుస్తోంది. కేజీఎఫ్ ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సీక్వెల్ ని భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. హీరో యశ్ అంతే హార్డ్ వర్క్ చేస్తున్నారట. ఇప్పటికే ఆన్ లొకేషన్ నుంచి కొన్ని పోస్టర్లు లీకై ఆసక్తిని పెంచాయ. యశ్ మరింత రఫ్ గా రగ్గుడ్ గా కనిపించబోతున్నారని ఇదివరకూ రిలీజైన పోస్టర్లు చెబుతున్నాయి.
కేజీఎఫ్ చాప్టర్ 1 తరహాలోనే పార్ట్ 2లో కోలార్ మాఫియాని మరో లెవల్లో చూపించేందుకు ప్రశాంత్ నీల్ ఓ రేంజులో స్కెచ్ వేశారట. అంతగా పాపులారిటీ లేని ముఖాలతోనే కేజీఎఫ్ చిత్రానికి గొప్ప పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాలో మాఫియా లీడర్లను అద్భుతంగా ఎలివేట్ చేశారు. అయితే ఈసారి ఒక పాపులర్ హీరోని ఉత్తరాది - దక్షిణాది ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన హీరోని భీకర విలన్ గా చూపించడం ద్వారా సీక్వెల్ పై భారీ అంచనాలు పెంచాలని ప్రశాంత్ నీల్ బృందం తెలివైన ప్లాన్ వేసింది. కేజీఎఫ్ సక్సెస్ నేపథ్యంలో అటు బాలీవుడ్ లోనూ సీక్వెల్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని సంజయ్ దత్ ని విలన్ గా దించే ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి.
అయితే ఆ విషయంపై స్పష్టత లేదు. దత్ ని ఫైనల్ చేయలేదని తర్వాత ప్రచారమైంది. హోంబలే సంస్థ సంజూ భాయ్ ఎంట్రీని అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ పూర్తవుతున్నా అసలు ఈ చిత్రంలో సంజయ్ దత్ నటిస్తున్నారా లేదా? అన్నదానికి సంబంధించిన గుట్టు విప్పకుండా రహస్యంగానే ఉంచారు. ఒక బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నారు అంటూ గుట్టు దాచే ప్రయత్నం చేస్తున్నారింకా. దీంతో ఆ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ ఎవరు? అంటూ అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. నిన్నటి రోజున ఆ స్టార్ ఎవరో రివీల్ చేస్తున్నామని జూలై 29 వరకూ వెయిట్ చేయాలంటూ `అధీరా` పేరుతో ఓ పోస్టర్ ని రివీల్ చేశారు. దాంతో అధీరా ఎవరు? అన్న ముచ్చటా సాగుతోంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ బర్త్ డే 29 జూలై. అందుకే ఆరోజు అధీరా లుక్ రిలీజ్ చేస్తున్నారు. అధీరా ఎవరో గుట్టు లీకైపోయింది అంటూ కేజీఎఫ్ ఫ్యాన్స్ కనిపెట్టేశారు. అధీరాగా సంజయ్ దత్ నటించారు ఇదిగో ప్రూఫ్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ప్రచారం చేస్తున్నారు. సంజయ్ దత్ కి బర్త్ డే గిఫ్ట్ అందుతోంది! సంజూ బాబానే అధీరా.. నో డౌట్!! అంటూ క్లారిటీ ఇచ్చేస్తున్నారు. సంజూ బాబా నటిస్తున్న తొలి సౌత్ సినిమా ఇది. ఆయన ప్రవేశం జరిగినట్టేనని అభిమానులు కేరింతలు కొడుతున్నారు.