Begin typing your search above and press return to search.

8 ఏళ్ళ రీమేక్ ఇప్పటికి కుదిరింది

By:  Tupaki Desk   |   15 May 2018 1:30 AM GMT
8 ఏళ్ళ రీమేక్ ఇప్పటికి కుదిరింది
X
సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం వచ్చిన ప్రస్థానం టాలీవుడ్ లో ఎంతటి సంచలన విజయం సొంతం చేసుకుందో తెలిసిందే. దీనితోనే శర్వానంద్ హీరోగా స్థిరపడగా సాయి కుమార్ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం దక్కింది. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కమర్షియల్ గా సైతం మంచి వసూళ్లను దక్కించుకుంది. చాలా క్లిష్టమైన కాన్సెప్ట్ ని దేవ కట్టా ప్రెజెంట్ చేసిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది. దీన్ని హిందీలో రీమేక్ చేయాలనీ దేవా కట్టా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. సంజయ్ దత్ తో చాలా కాలం నుంచి టచ్ లో ఉన్నాడు కాని ఏదీ ఒక కొలిక్కి రాలేదు. దానికి తోడు తను మధ్యలో చేసిన ఆటోనగర్ సూర్య, డైనమైట్ లాంటి సినిమాలు తేడా కొట్టడంతో బాలీవుడ్ లో తన సత్తా చాటాలనే కృత నిశ్చయంతో ప్రస్థానం రీమేక్ కోసం ఇప్పటి దాకా పడిన కష్టం ఫైనల్ గా ఒక ఫలితాన్ని ఇచ్చింది.

సంజయ్ దత్ ప్రస్థానం రీమేక్ లో సాయి కుమార్ పాత్రను పోషించడమే కాక దీనికి నిర్మాతగా కూడా వ్యవహరించడానికి రెడీ కావడంహో దేవా కట్టా కష్టం ఫలించినట్టే. శర్వానంద్ పాత్రలో అలీ ఫజల్ కనిపించనున్నాడు. స్టార్ హీరో కాకుండా ఇమేజ్ లేని ఇలాంటి నటుడు అయితేనే ప్రస్థానం తెలుగులో వచ్చిన ఫలితం హిందిలో కూడా రిపీట్ అవుతుందని నమ్ముతున్నాడు దేవా. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది ఇంకా డిసైడ్ కాలేదు. సౌత్ రీమక్ అంటే సంజయ్ దత్ కు ముందు నుంచి ఆసక్తే. నాగార్జునతో మంచి స్నేహ సంబంధాలు ఉన్న సంజయ్ దత్ హీరోగా తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్ప్పుడే కేవలం ఒక్క సీన్ కోసం నాగ్ చంద్రలేఖలో నటించాడు. లక్ష్మి నరసింహ లాంటి హింది రీమేక్స్ చేసిన అనుభవం కూడా సంజయ్ దత్ కు ఉంది. ప్రస్థానం కూడా బాగా నచ్చడం వల్లే నిర్మాతగా మారినట్టు టాక్. సాయి కుమార్ పాత్రలో సంజయ్ దత్ అంటే ఊహకే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక తెరపై మామూలుగా ఉంటుందా.