Begin typing your search above and press return to search.
మున్నాభాయ్ రిలీజ్.. మార్చి 7
By: Tupaki Desk | 9 Dec 2015 5:16 AM GMTమున్నాభాయ్ ఎంబిబిఎస్.. సంజూ భాయ్ ప్రస్తుతం ఎరవాడ-పూణే జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి1993 సీరియల్ బాంబ్ బ్లాస్ట్స్(-ముంబై) .. లో తనకి ప్రమేయం ఉందని సంజూ భాయ్ ఒప్పుకున్నాడు. అందుకే ఈ శిక్ష. అయితే ఈ జైలు శిక్ష అతడిలో బోలెడంత మార్పు తెచ్చింది. అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నాడన్న నెపంతో సంజయ్ ని టాడా కింద బుక్ చేసింది న్యాయస్థానం.
ఇప్పటికే జైలు శిక్ష తగ్గించాల్సిందిగా సంజయ్ దత్ గవర్నర్ కి అర్జీ పెట్టుకున్నాడన్న ప్రచారం ఉంది. అయితే దానిని సంజయ్ కి చెందిన వ్యక్తిగత లాయర్లు ఖండించారు. అలాంటిదేం లేదు. మొత్తం జైలు శిక్ష పూర్తవుతోంది. మార్చి 7న అతడు రిలీజవుతున్నాడు. ఇక శాశ్వతంగా అతడు బైటే ఉండొచ్చు. సినిమాలు చేసుకోవచ్చు అంటూ క్లియరెన్స్ ఇచ్చారు. ఇప్పటికే సంజయ్ దత్ పలుమార్లు పెరోల్ పై బైటికొచ్చారు. ఓసారి సినిమా షూటింగును కూడా చేశారు. ఓసారి తన కూతురు ముక్కు ఆపరేషన్ అంటూ నెలరోజుల పాటు బైటే గడిపాడు. 1996లో 18నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత పలుమార్లు అతడికి పెరోల్ వచ్చింది. ఐదేళ్ల జైలు శిక్షలో చాలావరకూ పూర్తి చేశాడు. పెరోల్ - పర్ లో అంటూ జైలు నుంచి బైటికొచ్చిన మున్నాభాయ్ .. ఇక మరోసారి లోనికి వెళ్లాల్సిన పని లేకుడా సెట్టయిపోతోంది.
పెరోల్ - పర్ లో వంటి అవకాశాలతో పాటు అతడు ఐదేళ్లు పూర్తి చేసుకున్నట్టే అని చెబుతున్నారు. దీన్ని బట్టి ఇక మున్నాభాయ్ మార్చిలో బైటికొచ్చాక ఇక స్వేచ్ఛా జీవి అయినట్టే.