Begin typing your search above and press return to search.
కాబిల్ పై కేసు పెట్టట్లేదండోయ్
By: Tupaki Desk | 17 Dec 2016 7:30 PM GMTహృతిక్ రోషన్ లేటెస్ట్ మూవీ కాబిల్.. వివాదంలో ఇరుక్కుందనే వార్తలు వచ్చాయి. తమ డేర్ డెవిల్ సిరీస్ ను కాపీ చేసిందంటూ.. నెట్ ఫ్లిక్స్ సంస్థ కాబిల్ నిర్మాతలపై కేసు వేయనుందంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే.. దీనిపై ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ నుంచి క్లారిటీ వచ్చింది.
కాబిల్.. డేర్ డెవిల్.. ఈ రెండింటి కాన్సెప్టులు ఒకేలా అనిపించడం సహజం. ఒక అనూహ్య సంఘటన కారణంగా కళ్లు పోగొట్టుకోవడం.. ఆ తర్వాత వారి జీవితం వివాదంలో చిక్కుకోవడం.. పగ తీర్చుకోవడం లాంటి కాన్సెప్ట్ తో సాగుతాయి. అయితే.. కాబిల్.. డేర్ డెవిల్ ల మధ్య చాలానే డిఫరెన్స్ ఉందని.. కనీసం కాబిల్ నిర్మాత- దర్శకులపై కేసు వేసే ఆలోచన కూడా లేదని నెట్ ఫ్లిక్స్ వర్గాలు తేల్చేశాయి. 'అసలు మాకు ఇలాంటి ఆలోచన కూడా లేదు. ఈ రూమర్ ఎలా పుట్టిందనే విషయంపై ప్రస్తుతం పరిశోధిస్తున్నాం' అంటు నెట్ ఫ్లిక్స్ తేల్చేయడంతో.. హృతిక్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పటికే దర్శకుడు సంజయ్ గుప్తా ఈ రూమర్స్ పై మాట్లాడాడు కూడా. 'కాబిల్ లో హృతిక్ ది సూపర్ హీరో పాత్ర కాదు. ఓ అంధుడిగా తనేం చేయగలడో చేస్తాడంతే. కానీ డేర్ డెవిల్ లో హీరో ఒకేసారి 30మందితో పైట్ చేసేస్తాడు' అని చెప్పాడు సంజయ్ గుప్తా. ఏదేమైనా అసలు కేసు ఆలోచనే లేదని నెట్ ఫ్లిక్స్ వాళ్లు తేల్చేయడంతో.. 2017 రిపబ్లిక్ డే రిలీజ్ కి కాబిల్ కి సమస్యలు ఏమీ లేనట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/