Begin typing your search above and press return to search.
ఈ స్టార్ ఫిల్మ్ మేకర్ వెబ్ ప్రయోగం వర్కౌట్ అయ్యేనా?
By: Tupaki Desk | 23 Oct 2021 12:30 AM GMTబాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ సుదీర్ఘ కాలంగా 'హీరామండీ' అనే ఒక ప్రాంతం గురించి సినిమాను చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. సినిమాగా దాన్ని తీసేందుకు ఏదో ఒక ఇబ్బంది ఆయనకు ఎదురు అవుతూ వచ్చింది. దాంతో ఆ సబ్జెక్ట్ ను సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ గా తీసేందుకు సిద్దం అయ్యాడు. నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించబోతున్నాడు. పాకిస్తాన్ లోని ప్రస్తుతం హీరామండీ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒకప్పుడు రాజులు యుద్దంలో గెలిచి తమకు నచ్చిన ఆడవారిని తీసుకు వచ్చి హీరామండీ లో ఉంచే వారు. అక్కడకు వెళ్లి వారు తమ కోరికలు తీర్చుకునే వారు. కాల క్రమేనా హీరామండీ అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాగా మారింది. వేశ్యలకు అడ్డాగా మారిన ఆ హీరామండీ గురించి ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ గా తీయబోతున్నాడు.
ఈ వెబ్ సిరీస్ లో సంజయ్ లీలా భన్సాలీ పాటలను పెట్టాలనుకుంటున్నాడు. సాదారణంగా అయితే వెబ్ సిరీస్ లో పాటలు ఉండవు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే కథను సాఫీగా చెప్పలేమనే ఉద్దేశ్యంతో కొన్ని కథలను వెబ్ సిరీస్ లుగా చెబుతూ ఉంటారు. అలాంటి వెబ్ సిరీస్ లో పాటలు పెట్టడం ఏంటీ అంటూ సంజయ్ లీలా భన్సాలీని ఇండస్ట్రీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై పాటల వరకు ఈ వెబ్ సిరీస్ లో ఉంటాయని ఆయన టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. ఆ మొత్తం పాటలను కూడా స్వయంగా సంజయ్ లీలా భన్సాలీ రికార్డ్ కూడా చేశాడని ప్రచారం జరుగుతోంది.
పౌరాణికం తరహాలో ఉండే ఈ వెబ్ సిరీస్ లో అన్ని పాటలు ఉంటే ప్రేక్షకులు ఆధరిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాటలు రెండు మూడు ఉంటే స్కిప్ చేసుకుంటూ వెళ్తారు. కాని మరీ అన్ని పాటలు ఉంటే ఎలా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాటలు ఉంటే సినిమా స్క్రీన్ ప్లేను స్లో డౌన్ చేస్తాయి. అప్పుడు ప్రేక్షకులు వెబ్ సిరీస్ ను మద్యలో వదిలేసినా ఆశ్చర్యం లేదు. అందుకే వెబ్ సిరీస్ లో పాటలు ఉండవద్దు అంటారు. వెబ్ సిరీస్ లో పాటలు పెట్టాలి అనే ప్రయోగం చేయబోతున్న సంజయ్ లీలా భన్సాలీ ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటాడు అనేది చూడాలి. ఒక వేళ భన్సాలీ ప్రయోగం సఫలం అయితే ముందు ముందు వెబ్ సిరీస్ ల్లో కూడా సినిమా మాదిరిగా డ్యూయెట్ లు పాటలు ఉంటాయేమో చూడాలి.